Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా దిల్ రాజు - రెండేళ్ల పదవీకాలం

ఠాగూర్
శనివారం, 7 డిశెంబరు 2024 (09:07 IST)
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ఆ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. గత ఎన్నికల్లో దిల్ రాజు కాంగ్రెస్ తరపున ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తెర వెనుక ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చినట్టు టాక్. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదికారంలో ఉండటంతో ఆయన టీఎఫ్‌డీసీ చైర్మన్ పదవి వరించింది. 
 
'పుష్ప-2' మూవీ.. వైల్డ్ ఫైర్ కాదు.. వరల్డ్ ఫైర్!! 
 
Allu Arjun Starrer Makes History  అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం "పుష్ప-2". ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా ఆరు భాషల్లో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన తొలి రోజునే చరిత్ర సృష్టించింది. తొలి రోజున ఏకంగా రూ.294 కోట్ల మేరకు కలెక్షన్లను రాబట్టింది. అలాగే, హిందీ సినిమా రికార్డులను కూడా ఓ చూపు చూసింది. ఫలితంగా 'పుష్ప వైల్డ్ ఫైర్ కాదనీ.. వరల్డ్ ఫైర్' అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వస్తున్నాయి. 
 
నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసిన ప్రకటన మేరకు.. 'పుష్ప-2' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.294 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు పేర్కొంది. భారత సినీ చరిత్రలో ఇంత వరకు ఏ సినిమాకూ ఈ స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్లు రాలేదు. 2022లో రాజమౌళి దర్శకత్వం వహించిన మాగ్నమ్ ఓపస్ "ఆర్ఆర్ఆర్" సినిమా కూడా తొలి రోజున రూ.233కోట్లు వసూలు చేయగా, ఆ రికార్డును ఇపుడు 'పుష్ప-2' అధికమించింది. 
 
ఇక హిందీ విషయానికి వస్తే అక్కడ కూడా రూ.72 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా సరికొత్త రికార్డును సెట్ చేసింది. ఇప్పటివరకు ఏ హిందీ చిత్రం కూడా మొదటిరోజు ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన 'జవాన్' చిత్రం హిందీ వెర్షన్ తొలి రోజున రూ.65.5 కోట్లు రాబట్టగా, ఇపుడు 'పుష్ప' దెబ్బకు రెండో స్థానానికి 'జవాన్' పడిపోయింది. అలాగే, తెలంగాణాలోని నైజాం ఏరియాలో తొలి రోజున రూ.30 కోట్లు వసూలు చేయగా, దాంతో నైజాలో 'ఆర్ఆర్ఆర్' సాధించిన రూ.23కోట్ల రికార్డు కనుమరుగైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త ఏడాది 2025 ఫిబ్రవరి 1 నుంచి ఆంధ్రలో భూమి రిజిస్ట్రేషన్ ఫీజుల మోత

Telangana MLC Constituencies: తుది ఓటర్ల జాబితా విడుదల.. వివరాలివే..

Black Moon: డిసెంబర్ 31, 2024.. బ్లాక్ మూన్‌ని చూడొచ్చు.. ఎలాగంటే?

ఉగాది నుండి అమలులోకి మహిళలకు ఉచిత బస్సు పథకం?

అపుడు బూతులు తిట్టి.. ఇపుడు నీతులు చెబితే ఎలా? : పేర్ని నానిపై పవన్ కళ్యాణ్ ఫైర్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

తర్వాతి కథనం
Show comments