Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలిని కట్టప్ప చీకట్లో చంపేశాడు.. వెండితెరపై వెలుతురుంటుంది.. చూడండి: రానా

బాహుబలి టీమ్ ప్రస్తుతం బాహుబలి ది కన్‌క్లూజన్ ప్రమోషన్‌లో బిజీ బిజీగా ఉంది. ఇటీవలే మలయాళ బాహుబలి సినిమా ఆడియో రిలీజైంది. ఈ క్రమంలో రానా దగ్గుబాటి ఓ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ ప్రోగ్రామ్‌లో

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (17:59 IST)
బాహుబలి టీమ్ ప్రస్తుతం బాహుబలి ది కన్‌క్లూజన్ ప్రమోషన్‌లో బిజీ బిజీగా ఉంది. ఇటీవలే మలయాళ బాహుబలి సినిమా ఆడియో రిలీజైంది. ఈ క్రమంలో రానా దగ్గుబాటి ఓ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ ప్రోగ్రామ్‌లో రానాను బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిందిగా కోరారు.

ఈ ప్రశ్నకు రానా దాట వేయకుండా చమత్కారంతో బదులిచ్చాడు. బాహుబలిని కట్టప్ప చీకట్లో చంపేశాడని.. ఆ చీకట్లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియరా లేదని.. ఆ చీకట్లో తనకు ఆ దృశ్యం సరిగా కనిపించలేదని, ఎందుకు చంపాడో తెలియలేదని రానా సమాధానం ఇచ్చాడు. 
 
అంతేగాకుండా వెండితెరపై వెలుతురు ఉంటుందని అందులో చూడాలని ఉచిత సలహా కూడా ఇచ్చాడు రానా. బాహుబలి-2లో తనకు అనుష్క యాక్షన్ బాగా నచ్చిందన్నాడు. బాహుబలి-1లో యుద్ధ సన్నివేశాల వంటి రిస్కీ యాక్షన్ దృశ్యాలు చేయడం తొలి ప్రయత్నం కావడంతో కాస్త కష్టపడ్డానని.. కానీ రెండో పార్టులో ఆ బాధ తప్పిందని.. యాక్షన్, యుద్ధ సన్నివేశాలు సులభం చేసేశానని చెప్పుకొచ్చాడు. బాహుబలి 2 తప్పకుండా హిట్ కొడుతుందని.. అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంటుందని తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ ఇలా జావగారిపోయారేంటి? ఏమైంది? (video)

రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

పాక్ ఉద్యోగికి భారత్ డెడ్‌లైన్ - 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ హుకుం..

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments