Webdunia - Bharat's app for daily news and videos

Install App

'డిక్టేటర్' రివ్యూ రిపోర్ట్: సంక్రాంతికి మాస్ మసాలా.. అభిమానులకు పండగే పండగ!!

Webdunia
గురువారం, 14 జనవరి 2016 (14:40 IST)
డిక్టేటర్ మూవీకి మాస్ ఇమేజ్ టాక్ వచ్చింది. మాస్ అలరించే విధంగా బాలయ్య డిక్టేటర్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. బాలకృష్ణ, అంజలి, అక్ష, సోనాల్ చౌహాన్ తదితరులు నటించిన ఈ సినిమా సంక్రాంతికి మాస్ మసాలా అని.. అభిమానులకు పండగలా ఉంది. కుటుంబ విలువలున్న డిక్టేటర్.. క్లాస్, మాస్‌తో నందమూరి అభిమానులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ బాషా కథను పోలివున్నప్పటికీ.. దర్శకత్వం కొత్తగా ఉంది. అభిమానులను ఆకట్టుకునే రీతిలో డిక్టేటర్ ఉన్నాడు. మొత్తానికి అభిమానులకు డిక్టేటర్ పండుగలా ఉంది.  
 
నటీనటులు : బాలకృష్ణ, అంజలి, అక్ష, సోనాల్ చౌహాన్ తదితరులు
విడుదల తేదీ : 14-జనవరి-2016
దర్శకత్వం : శ్రీవాస్ (లౌక్యం ఫేమ్) 
నిర్మాత : వేదష్వా క్రియేషన్స్ & ఎరోస్ ఇంటర్నేషనల్ 
 
కథ :
హైదరాబాద్‌లోని ధర్మ గ్రూప్ అఫ్ కంపెనీస్‌కి చెందిన ఓ షాపింగ్ మార్ట్‌లో ధర్మ (బాలకృష్ణ) పని చేస్తుంటాడు. అనాధ అయిన ధర్మ కాత్యాయని (అంజలి)ని పెళ్లి చేసుకొని వాళ్ళ ఫ్యామిలీతోనే ఉంటాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే కాత్యాయని ధర్మతో కలిసి ఉండదు. అలా జరుగుతున్న టైంలో ధర్మకి హీరోయిన్ అవ్వాలనుకుంటున్న ఇందు(సోనాల్ చౌహాన్)తో పరిచయం అవుతుంది. ఎప్పుడు చాలా కూల్‌గా ఉండే ధర్మ ఇందుని ఒక రౌడీ బాచ్ కిడ్నాప్ చేయడంతో తనని కాపాడడం కోసం తనలోని వయొలెంట్ యాంగిల్‌ని బయటికి తీస్తాడు. 

బుక్ మై షో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 
అలా వార్తల్లో నిలిచిన ధర్మని ఎతుక్కుంటూ ధర్మ గ్రూప్ అఫ్ కంపెనీ చైర్మన్ రాజశేఖర్(సుమన్) వస్తాడు. అలా వచ్చిన రాజశేఖర్ ధర్మని డిక్టేటర్‌గా పరిచయం చేస్తాడు. అసలు ఈ డిక్టేటర్ కథ ఏంటీ? ఎందుకు అతను హైదరాబాద్‌లో తన పేరు మార్చుకొని ఎందుకు ఉన్నాడు? అసలు అంజలి ఎందుకు డిక్టేటర్‌కి దూరంగా ఉంది? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 
 
పెర్ఫార్మన్స్ :
బాలకృష్ణ ఒకే పాత్రలో రెండు విభిన్నమైన షేడ్స్ చూపించాడు. అవే డిక్టేటర్ అలియాస్ చంద్రశేఖర్ ధర్మ, చందు. తొలుత వచ్చే చందు రొమాన్స్, రొమాన్స్ మిక్స్ చేసి డిజైన్ చేశారు. ఈ పాత్రకి రాసిన కొన్ని కొన్ని సీన్స్ అవసరమా అని అనిపించినా, ఒకటి రెండు సీన్స్‌లో మాత్రం బాలయ్య తనదైన మార్క్ చూపాడు. ఇక సినిమాకే హైలైట్ అయిన చంద్ర శేఖర్ ధర్మ అలియాస్ డిక్టేటర్ పాత్రలో బాలకృష్ణ ఫెంటాస్టిక్ అనేలా చేసాడు. 
 
ఇలాంటి పాత్రలు చేయడం బాలకృష్ణకి వెన్నతో పెట్టిన విద్య. అందుకే డిక్టేటర్ పాత్రలో అదరగొట్టేసాడు. డిక్టేటర్‌లో బాలయ్య పరంగా కొత్తగా అనిపించేది మాత్రం ఆయన లుక్. చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. అది సినిమాకి చాలా కొత్త లుక్‌ని తీసుకొచ్చింది. అంజలి కేవలం రెండు పాటలున్న అని పాత్ర కాకుండా కాస్త కథకి అవసరమైన పాత్ర చేసింది. అలాగే రెండు మూడు సీన్స్‌లో తన నటనతో ఆకట్టుకుంది. మరో హీరోయిన్ అయిన సోనాల్ చోహాన్ డిక్టేటర్‌కి గ్లామర్ అట్రాక్షన్. అందుకే సోనాల్ కూడా ఎక్కడా తగ్గకుండా వీలైనంతగా తన అందాలను ఆరబోసి ఫస్ట్ హాఫ్‌లో అందరినీ తన వైపుకు తిప్పుకుంది. 
 
అక్ష తనకిచ్చిన చిన్న పాత్రలో బాగానే చేసింది. లేడీ విలన్‌గా రతి అగ్నిహోత్రి బాలయ్యని తట్టుకోలేకపోయింది. అందుకే ఈ విలన్ పాత్ర తుస్సుమంది. ఇక మేల్ విలన్స్‌గా చేసిన కబీర్ దుహన్ సింగ్, నవాబ్ షాలు కూడా నెగటివ్ షేడ్స్‌లో మెప్పించలేకపోయారు. వీరి తర్వాత ముఖ్య పాత్రలు చేసిన సుమన్, నాజర్, అజయ్, సాయాజీ షిండే, పోసాని కృష్ణమురళిలతో పాటు కమెడియన్లు తమ పాత్రలకు న్యాయం చేశారు. 
 
నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆయన నుంచి ఏమేమి కోరుకుంటారో ఆయా అంశాలను పెట్టి తీసిన రొటీన్ కమర్షియల్ సినిమానే ‘డిక్టేటర్’. కానీ ఆ అంశాలు అన్నీ కేవలం సెకండాఫ్‌లో మాత్రమే ఉన్నాయి. ఈ మూవీలో కొత్తగా అనిపించేది ఒకే ఒక్క పాయింట్.. బాలకృష్ణ స్టైలిష్ ప్రెజంటేషన్. బాలయ్యని కొత్తగా ప్రెజంట్ చేయడంలో, డిక్టేటర్ పాత్రని బాగా ఎగ్జిక్యూట్ చేయడం వలన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌కి బాగా నచ్చుతుంది. సంక్రాంతి సీజన్ కావడం వలన ఎంటర్టైన్మెంట్ సినిమాలు కోరుకునే వారు, నందమూరి అభిమానులు బాగా ఎంజాయ్ చేసే సినిమా ‘డిక్టేటర్’.

బుక్ మై షో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 
ప్లస్ పాయింట్స్ : బాలకృష్ణ స్టైలిష్ ప్రెజంటేషన్, ఇంటర్వల్ బ్లాక్ అండ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
మైనస్ : అదే పాత కథ, కథనం
రేటింగ్ : 2.5/5

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments