ధన్య బాలకృష్ణన్ నటించిన జగమే మాయ డిస్నీలో స్ట్రీమింగ్

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (19:42 IST)
Dhanya Balakrishnan, Teja Ainampudi
ధన్య బాలకృష్ణన్, తేజ ఐనంపూడి, చైతన్య రావ్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా జగమే మాయ. ఇన్ స్టంట్ కర్మ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని జ్యాపీ స్టూడియోస్ పతాకంపై ఉదయ్ కిరణ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే నిర్మించారు. క్రైమ్ డ్రామా కథతో దర్శకుడు సునీల్ పుప్పాల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 15వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జగమేమాయ స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా హైదరాబాద్ లో చిత్ర ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో 
 
హీరోయిన్ ధన్య బాలకృష్ణన్ మాట్లాడుతూ...ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఐడియా మీద వెళ్లే సినిమా ఇది. మనలో ఎవరూ బ్లాక్ అండ్ వైట్ లాంటి వ్యక్తిత్వం కలిగి ఉండరు. అందరిలోనూ గ్రే షేడ్స్ ఉంటాయని చెప్పే కథ ఇది. దర్శకుడు సునీల్ నాకు కథ చెప్పినప్పుడు మీ కళ్లతోనే నటించాల్సి ఉంటుంది అన్నారు. ఆ పాత్రలోని ఇంటెన్సిటి అప్పుడే అర్థమైంది. నేను బాగా నటించానని అనుకుంటున్నాను. అని చెప్పింది.
 
తేజ ఐనంపూడి మాట్లాడుతూ...మీకొక మంచి సినిమా చూపించామని ఆశిస్తున్నాము. జీవితంలో మనం ఒకరికి చెడు చేయాలని చూస్తే..ఆ బ్యాడ్ మనకే జరుగుతుంది అని చెప్పే చిత్రమిది. నాకు ఇలాంటి మంచి రోల్ ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. అన్నారు.
 
సంగీత దర్శకుడు అజయ్ అరసాడ మాట్లాడుతూ...ఈ సినిమా చూసినప్పుడు నటీనటుల పర్మార్మెన్స్ గురించి చెప్పాలనిపించింది. తేజ, ధన్య బాగా నటించారు. మ్యూజిక్ కు స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. అన్నారు.
 
దర్శకుడు సునీల్ పుప్పాల మాట్లాడుతూ...అందరి సహకారంతో ఇవాళ మీ ముందుకు మా సినిమాను తీసుకొస్తున్నాం. కథ చెప్పగానే మా ప్రొడ్యూసర్ ఏ ప్రశ్నలు లేకుండా బడ్జెట్ ఎంత అన్నారు. అంతగా స్క్రిప్ట్ ను నమ్మారు. నటీనటులు ఎన్ని టేక్స్ చెప్పినా చేసేవారు. ఒక ఫ్రెండ్స్ లా చిత్రాన్ని కంప్లీట్ చేశాం. అయితే ఫుల్ క్రెడిట్ మాత్రం ప్రొడ్యూసర్స్ కు ఇస్తాను. అన్నారు.
 
నిర్మాతలు మాట్లాడుతూ...మా సంస్థలో ఓటీటీ ప్రాజెక్ట్స్ చేద్దామా, సినిమాలు చేయాలా అని కొంత వర్క్ చేశాం. జగమేమాయ చిత్రాన్ని జూలైలో ప్రారంభించాం. అప్పుడు ఇండస్ట్రీలోని కొందరు మిత్రుల సలహాలు తీసుకున్నాం. మొత్తంగా సక్సెస్ ఫుల్ గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాం. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మా సినిమా చూసి ఎంకరేజ్ చేయండి. అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments