Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

దేవీ
మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (09:04 IST)
Dhanush - kubera song
కుబేర సినిమాలో ధనుష్ డ్యాన్స్, విజల్స్ వేస్తూ పండుగ మూడ్ లో జనాలతో కేరింతలు కొడుతున్న పోస్టర్ ను చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు. మాస్ సాంగ్ తో అలరించబోతున్నట్లు కనిపిస్తుంది.  ఇప్పటికే సినిమా ప్రమోషన్ లో భాగం నటీనటుల లుక్ లను విడుదలచేశారు. ఇక 'కుబేర' ఫస్ట్ సింగిల్ ఏప్రిల్ 20, 2025న విడుదల కానుంది. ఈరోజు డేట్ ని అనౌన్స్ చేశారు.  పాట యొక్క మరిన్ని వివరాలతో ప్రోమోను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
 
శేఖర్ కమ్ముల 'కుబేర' దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్, ఇది నేషనల్ అవార్డు గ్రహీత దర్శకుడు శేఖర్ కమ్ముల, నేషనల్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు డీఎస్పీ మొదటిసారి కలిసి చేస్తున్న చిత్రం! మరో ఎక్సయిటింగ్ విషయం ఏమిటంటే నేషనల్ అవార్డు గ్రహీత ధనుష్ ఫ్రేమ్‌లో ఉన్నారు! ఈ ముగ్గురూ కలిసి మాస్ డ్యాన్స్ నంబర్ ఇవ్వడం ఇదే మొదటిసారి.
 
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం 'కుబేర'. ధనుష్, నాగార్జున అక్కినేని, రష్మిక మందన్న, జిమ్ సర్భ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా నిలుస్తుంది. ఎపిక్ సోషల్ డ్రామా రూపొందుతోంది. ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి భారీ స్థాయిలో చిత్రీకరించబడుతోంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తారు.  'కుబేర' జూన్ 20, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్‌కు టీడీపీ నాయకత్వ పగ్గాలు అప్పగిస్తారా? చంద్రబాబు యాన్సర్ ఏంటి?

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments