Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

దేవీ
సోమవారం, 21 ఏప్రియల్ 2025 (08:57 IST)
ధనుష్, దర్శకుడు శేఖర్ కమ్ముల, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కలయికలో కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా.. మ్యూజిక్, డాన్స్ అదిరిపోయేట్లుగా వున్నాయి. విడుదలైన ఈ సాంగ్ కు సోషల్ మీడియాలో ఆదరణ పొందింది.  రాక్‌స్టార్ DSP అందించిన ఈ పాట ఎక్స్‌ప్లోసివ్ ఎనర్జీతో ఉంది. ఫుట్ టాపింగ్ బిట్స్ తో ప్రేక్షకులు హృదయాలను వెంటనే గెలుచుకుంటాయి. ధనుష్ స్వయంగా పాడిన వాయిస్ ఈ పాటకి మరింత ఫీల్ తీసుకొచ్చింది – అతని గాత్రంలో ఉన్న మాగ్నెటిక్ ఫోర్స్‌ పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది.
 
భాస్కరభట్ల రాసిన సాహిత్యం అందరినీ అలరిస్తూ, మాస్ టచ్‌కి తగిన రిథమిక్ మ్యాజిక్‌ ను అందించింది. శేఖర్ వి.జె అందించిన కొరియోగ్రఫీ పాటను ఒక విజువల్ ట్రీట్‌ గా మలిచింది – ధనుష్ డాన్స్‌లో చూపిన స్పిరిట్, ఎనర్జీ, ఒరిజినాలిటీ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది.
 
ఈ పాటలో విజువల్స్, వాయిస్, సాహిత్యం, కొరియోగ్రఫీ అన్నీ కలసి ఒక అద్భుత అనుభూతిని అందిస్తున్నాయి.
 
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘కుబేర’ భావోద్వేగాలు, డ్రామా, గ్రాండ్ విజువల్స్ కలిగిన మల్టీ లింగ్వల్ ప్రాజెక్ట్. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా మరియు జిమ్ సార్బ్ వంటి స్టార్ తారాగణం ఉంది. 
 
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ Pvt Ltd పతాకాలపై సునీల్ నారంగ్ ,పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందించబడింది హిందీ, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది – ఇది ట్రూ పాన్ ఇండియన్ సినిమా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వల్లభనేని వంశీకి షాక్ - అలా బెయిల్ ఎలా ఇస్తారంటూ సుప్రీం ప్రశ్న?

Delhi: మూడేళ్ల పసికూనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు

అలస్కా తీరంలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకో తెలుసా?

హిందూపురం నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసిన వైకాపా హైకమాండ్- దీపికకు అది నచ్చలేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments