Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవర కొండ కొత్త చిత్రం ''అర్జున్ రెడ్డి'' ప్రారంభం

Webdunia
గురువారం, 12 మే 2016 (17:35 IST)
‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో డిఫరెంట్ క్యారెక్టర్ లో మెప్పించిన విజయ్ దేవర కొండ హీరోగా నూతన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రం మే 11న హైదరాబాద్లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. భ్రదకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ దర్శకత్వంలో ప్రణయ్ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. షాలిని హీరోయిన్‌గా నటిస్తుంది. సినిమా ప్రారంభమైన రోజునే సినిమా పస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. డిఫరెంట్ లవ్ అండ్ యాక్షన్ స్టోరీ తో రూపొందనున్న ఈ చిత్రం జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకోనుంది. 
 
ఈ చిత్రాన్ని హైదరాబాద్, మంగళూర్, డెహ్రడూన్, ఢిల్లీతో పాటు ఇటలీలో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు రధన్ సంగీతాన్ని అందిస్తుండగా, నగేష్ బన్నేల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 
 
విజయ్ దేవర కొండ ఇప్పుడు ‘పెళ్లిచూపులు’ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టీజర్ కు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు అర్జున్ రెడ్డి అనే డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments