Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నిరాశ - 'దేవర' పాట రిలీజ్ వాయిదా

ఠాగూర్
గురువారం, 19 సెప్టెంబరు 2024 (12:09 IST)
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఆయన కొత్త చిత్రం దేవర నుంచి ఆయుధ పూజ పాటను గురువారం ఉదయం రిలీజ్ చేయున్నట్టు మూవీ మేకర్స్ తొలుత ప్రకటించారు. అయితే అనివార్య కారణాలతో ఈ పాటను రిలజ్ చేయడం లేదని పేర్కొన్నారు. 
 
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దేవర. ఈ నెల 27వ తేదీన విడుదలకానుంది. ప్రస్తుతం దేవర చిత్ర యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. 
 
తాజాగా ఈ చిత్రం నుంచి మరో ఆసక్తికర పాట విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. గురువారం ఉదయం 11.07 గంటలకు యూట్యూబ్ ద్వారా ఆయుధ పూజ పాటను విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ పాటను అనుకున్నట్టు సమయానికి విడుదల చేయలేదు. పాటను ఎపుడు విడుదల చేస్తారో తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. 
 
కాగా, ఇప్పటికే తారక్, జాహ్నవి కాంబినేషన్‌లో వచ్చిన రొమాంటిక్ సాంగ్ 'చుట్టమల్లె' పాట యూట్యూబ్‌లో రికార్డులు బ్రేక్ చేసింది. ఈ పాటకి జాతీయస్థాయిలో స్పందన వచ్చింది. త్వరలో విడుదలయ్యే ఆయుధ పాట కూడా హిట్ కావడం ఖాయమని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. పండగ చేసుకుంటోన్న పవన్ ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన విజయసాయి రెడ్డి

తల్లి స్థానం దేవుడి కంటే గొప్పది : ప్రధాని నరేంద్ర మోడీ

మీరు కోట్లాది మందికి మార్గదర్శకుడిగా ఉండాలి : ఇట్లు.. మీ తమ్ముడు

థ్యాంక్యూ చిన్నన్నయ్యా.. మీరిచ్చిన పుస్తకమే రాజకీయ చైతన్యం కలిగించింది : పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments