Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ హైకోర్టులో మంచు విష్ణుకు ఊరట

ఠాగూర్
బుధవారం, 9 అక్టోబరు 2024 (15:19 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ప్రతిష్టను దిగజార్చేలా యూట్యూబ్‌లో ఉంచిన వీడియోలను తొలగించాలని పలు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులను న్యాయస్థానం ఆదేశించింది. అపఖ్యాతి పాల్జేసే ప్రచురణలు, వీడియో కంటెంట్లను వ్యాప్తి చేయొద్దని స్పష్టం చేసింది. 
 
విష్ణు మంచు పేరు, స్వరం, చిత్రాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా దుర్వినియోగం చేయొద్దని ఆదేశించింది. పిటిషనర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ఘటనలకు పాల్పడుతున్న ఎవరిపై అయినా చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు విష్ణుకు వెసులుబాటు ఇచ్చింది. మంచు విష్ణుపై పోస్టు చేసిన పది యూఆర్ఎల్ లింక్లను తొలగించాలని కేంద్ర సమాచారశాఖ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను ఆదేశించింది. 
 
సంబంధిత లింక్లను తొలగించాలని ఆయా యూట్యూబ్ ఛానళ్లకు స్పష్టం చేసింది. ఛానళ్లు 48 గంటల్లో తొలగించకపోతే వాటి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని యూట్యూబ్ సంస్థను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మిని పుష్కర్ణ ఈ నెల ఒకటో తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. తన ప్రతిష్టను దిగజార్చేలా పలు యూట్యూబ్ ఛానళ్లు వీడియోలు ప్రసారం చేయడాన్ని సవాలు చేస్తూ మంచు విష్ణు ఈ పిటిషన్ దాఖలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Tirupati Stampede తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లకై తొక్కిసలాట: ఆరుగురు భక్తులు మృతి

ఆ 3 గ్రామాల ప్రజలకు ఒక్క వారం రోజులలో బట్టతల వచ్చేస్తోంది, ఏమైంది?

TSPSC-గ్రూప్ 3 పరీక్ష- కీ పేపర్స్ విడుదల.. మే 1 నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు

ఖమ్మం పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు- ఒకే ఒక విద్యార్థి

Modi: విశాఖపట్నంలో ప్రధాని గ్రాండ్ రోడ్ షో.. పూల వర్షం కురిపించిన ప్రజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments