Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెజాన్ ప్రైమ్ లో ఆకట్టుకుంటున్న మిస్టరీ థ్రిల్లర్ దేజావు

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2022 (17:08 IST)
Dijavu poster
కంటెంట్ ప్రధానంగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం దేజావు సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతుంది. అరుల్‌నిథి, మధుబాల, స్మృతి వెంకట్, అచ్యుత్ కుమార్, కాళీ వెంకట్, మిమే గోపి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌కి అరవింద్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. గ్రిప్పింగ్ ట్విస్ట్‌లు, ఊహించని మలుపులతో శ్రీనివాసన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 
 
ఒక నవల రచయిత ఊహించిన పాత్రలు సజీవంగా వచ్చి అతన్ని బెదిరించినప్పుడు ఏమి జరుగుతుంది? కల్పన అనేది భయానక వాస్తవంగా మారినప్పుడు ఏమి జరుగుతుంది?.. అనేదే దేజావు చిత్రం. ఈ కథలో పోలీసు ఇన్వెష్టిగేషన్ ప్రారంభం కావడం, హత్యలు, ఇతర ఘోరమైన ఘటనలు చోటుచేసుకోవడం.. చిత్రంపై ఉత్కంఠను తారాస్థాయికి చేరుస్తుంది. చివరి వరకు కూడా దర్శకుడు ఈ చిత్రాన్ని సస్పెన్స్‌తో నడిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 
 
2022 జూలైలో తమిళంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ విధమైన నాణ్యమైన కంటెంట్, థ్రిల్లింగ్ అనుభూతిని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో భవాని DVD Incపై రాజశేఖర్ అన్నభీమోజు తెలుగు వెర్షన్‌ను నిర్మించారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం, పీజీ ముత్తయ్య సినిమాటోగ్రఫీ ప్రశంసలు అందుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని, శ్రీరెడ్డిలు పోయారు.. మా వారు తట్టుకుని నిలబడ్డారు.. నారా లోకేష్

చక్రం తిప్పిన పవర్ స్టార్.. ఆయన వల్లే గెలిచానన్న దేవేంద్ర బహిరంగ ప్రకటన (video)

జగన్‌ హయాంలో భూ ఆక్రమణలు.. వదిలిపెట్టేది లేదన్న పవన్ కల్యాణ్

30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments