Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకున్న దీపిక? రణ్‌వీర్‌కు అన్యాయం చేశావంటూ నెటిజన్ల ఫైర్

"పద్మావతి" దీపికా పదుకొనేకు పెళ్లి అయిందట. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు తీవ్రంగా మండిపడుతూ, బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌కు ఎందుకు అన్యాయం చేశావంటూ ప్రశ్నిస్తున్నారు.

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (16:44 IST)
"పద్మావతి" దీపికా పదుకొనేకు పెళ్లి అయిందట. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు తీవ్రంగా మండిపడుతూ, బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌కు ఎందుకు అన్యాయం చేశావంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికంతటికీ కారణం దీపికా పదుకొనే తాజాగా చేసిన ఓ ఫోటోనే కారణం. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు సంతోషంతో పాటు ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు.
 
తాజాగా దీపికా పదుకొనే ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మెడ‌లో దండ ఉన్న వ్య‌క్తిని కౌగిలించుకుని ఉన్న ఓ ఫోటోను ఆమె తన సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దాని కింద "అప్పుడు, ఇప్పుడు.. ఎప్ప‌టికీ" అని క్యాప్ష‌న్ కూడా పెట్టింది. దీంతో ఆమెకు పెళ్లి అయిపోయిందంటూ నెటిజన్లు ఫోటోను షేర్ చేస్తున్నారు. ఈ విష‌య‌మై ట్రోలింగ్ కూడా చేస్తున్నారు.
 
ఇంతలో కొంతమంది నెటిజన్లు తమకు తోచినవిధంగా స్పందిస్తున్నారు. దీపికా.. ఇంతలోనే పెళ్లి చేసుకున్నావా? ఈ స‌మ‌యంలో పెళ్లి చేసుకోవ‌డం మంచిది కాదంటూ కొందరు ట్వీట్ చేశారు. మరికొందరైతే 'ర‌ణ్‌వీర్‌కు ఎందుకు అన్యాయం చేశావ'ని ప్ర‌శ్న‌లు కూడా అడుగుతున్నారు. 
 
నిజానికి దీపిక‌తోపాటు ఆ ఫోటోలో ఉన్న‌ వ్య‌క్తి ఆమె చిన్న‌నాటి స్నేహితుడు ఆదిత్య నారాయ‌ణ్‌. చిన్న‌ప్ప‌టి నుంచి వారిద్ద‌రూ ప్రాణ స్నేహితులు. ఆదిత్య వివాహానికి హాజ‌రైన దీపిక అత‌నితో క‌లిసి ఇలా ఫోటోల‌కు ఫోజులిచ్చింది. ఆదిత్య‌తో క‌లిసి చిన్న‌ప్పుడు తీయించుకున్న ఫోటోల‌ను కూడా దీపిక ఇపుడు షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో వైరల్ అయింది. అద్గదీ ఆ ఫోటో వెనుకదాగివున్న సీక్రెట్.
 
కాగా, దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రధారులుగా బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరెక్కించిన చిత్రం పద్మావతి వచ్చే నెల ఒకటో తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఈ చిత్రంపై వివాదం చెలరేగడంతో చిత్ర యూనిట్ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసింది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వీడు సామాన్యుడు కాదు.. అసాధ్యుడు.. నాలుకతో ఫ్యాన్ రెక్కలను...

కేసీఆర్ ఫ్యామిలీ వెయ్యేళ్లు జైలుశిక్ష అనుభవించాలి : సీఎం రేవంత్ రెడ్డి

జనసేన పార్టీకి ఇంధనం దిల్ రాజు, నా బంగారం రామ్ చరణ్: డిప్యూటీ సీఎం పవన్

మకర సంక్రాంతికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి వుండరా?

Telangana : తెలంగాణలో ఎటువంటి కేసులు లేవు - HMPVపై భయం వద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments