Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకునే..?

Webdunia
ఆదివారం, 1 మార్చి 2020 (13:14 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాధాకృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమా రూపుదిద్దుకుంటోంది. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుంది. కాగా ఈ మూవీ సెట్స్‌ఫై ఉండగానే మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు. 
 
ఈ చిత్రం గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదని, పాన్ వరల్డ్ సినిమా అని అన్నారు. దీన్నిబట్టి చిత్రం ఎంత భారీగా ఉండనుందో అర్థమవుతోంది. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ రోల్ కోసం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకునేను తీసుకునే ఆలోచనలో ఉన్నారని టాక్. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు మొదలైనట్టు ఫిల్మ్ నగర్ టాక్.
 
మరోవైపు ప్రభాస్ చేస్తున్న 'జాన్' చిత్రం పూర్తవగానే కొత్త సినిమా మొదలు కానుంది. మహానటి సినిమా తరహాలో భారీ బడ్జెట్ చిత్రంగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్టు సమాచారం.  

సంబంధిత వార్తలు

వెలుగు చూడాల్సిన జగన్ జల్సా ప్యాలెస్ రహస్యాలు చాలా ఉన్నాయ్... : మంత్రి నారా లోకేశ్

సిగ్నల్ జంప్ చేసి ఎక్స్‌ప్రెస్ రైలను ఢీకొన్న గూడ్సు రైలు.. 15కి పెరిగిన మృతులు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన... త్వరలో ప్రారంభం

19న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్

లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన అన్నాడీఎంకే... రీఎంట్రీకి ఆసన్నమైందంటున్న శశికళ!

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments