Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ డైరెక్టర్ దెబ్బకు ఈ హీరోయిన్ చాన్స్ గల్లంతు.. ఆ బాధ చెప్పలేనిదంటున్న హాసిని

ఒక సినిమా షూటింగ్ కమింట్ కోసం మరో పెద్ద సినిమాలో చాన్స్ మిస్సయితే ఆ బాధ ఎలాంటిదో స్వయంగా అనుభవిస్తే కానీ తెలీదు. అందులోనూ తన సినీ కెరీర్‌కు అవకాశమిచ్చిన మేటి హీరో చిత్రాన్ని మిస్ చేసుకోవడం అంటే ఏ హీరోయిన్‌కి అయినా సగం ప్రాణం పోయినట్లే మరి. బాలీవుడ్ చ

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (07:25 IST)
ఒక సినిమా షూటింగ్ కమింట్ కోసం మరో పెద్ద సినిమాలో చాన్స్ మిస్సయితే ఆ బాధ ఎలాంటిదో స్వయంగా అనుభవిస్తే కానీ తెలీదు. అందులోనూ తన సినీ కెరీర్‌కు అవకాశమిచ్చిన మేటి హీరో చిత్రాన్ని మిస్ చేసుకోవడం అంటే ఏ హీరోయిన్‌కి అయినా సగం ప్రాణం పోయినట్లే మరి. బాలీవుడ్ చిరునవ్వుల స్వప్న సుందరి దీపికా పడుకొనె ఇప్పుడు అలాంటి డైలెమ్మాలోనే కొట్టుమిట్టులాడుతోందని సమాచారం. మేటి దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో వస్తున్న పద్మావతి సినిమాను సకాలంలో పూర్తి చేయడానికి అదనపు తేదీలు కేటాయించవలసి రావడం అనే పరిణామం షారుక్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని పోగొట్టిందే అని ఇప్పుడు తెగ బాధపడిపోతోంది దీపికా.
 
వరుస వివాదాల మధ్య చిక్కుకున్న చారిత్రాత్మక సినిమా ‘పద్మావతి’ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా అనుకున్నట్లు ఈ ఏడాది నవంబర్‌ 17నే విడుదల చేయాలని దర్శకుడు బన్సాలీ స్ట్రాంగ్‌గా ఫిక్సయ్యారట. రాజపుత్రుల సంస్కృతిని ఈ సినిమాలో అభ్యంతరంగా చిత్రిస్తున్నారన్న ఆరోపణతో ఇప్పటికే ఒకసారి దర్శకుడిపై కొందరు సాంస్కృతిక తీవ్రవాదులు దాడి చేయడం, మరోసారి షూటింగునే నిలిపివేసి గొడవ చేయడంతో భన్సాలీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారటం. అందుకే ముందుగా అనుకున్న సమయానికే సినిమాను పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్న భన్సాలీకి ఈ చిత్రంలోని నటీనటులందరూ అదనపు డేట్స్ ఇచ్చేశారట.  అందుకే ఒక్క దీపికా మాత్రమే కాదు.. ఈ చిత్రంలోని స్టార్లందరూ ఇతర సినిమాలకు ‘నో’ చెప్తున్నారని బాలీవుడ్ చెప్పుకుంటోంది.
 
ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకత్వంలో షారుక్‌ ఖాన్‌ హీరోగా రూపొందనున్న కొత్త  చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్‌ ఉందట. కత్రినా కైఫ్, దీపికా పదుకొనే పేర్లను చిత్రబృందం పరిశీలనలోకి తీసుకుని, వారిని సంప్రదించగా దీపికా పదుకొనే యాక్ట్‌ చేసేందుకు ఒప్పుకోలేదని తెలిసింది. పద్మావతి చిత్రం శరవేగంగా పూర్తి కావడం మీదే ఆమె దృష్టి ఉండటంతో తన కెరీర్‌ను నిలబెట్టిన షారుక్ ఖాన్ చిత్రంలో చాన్సును కూడా బాధతోనే ఆమె మిస్ చేసుకుందని సమాచారం.
 
షారుక్‌‌తో మూవీకి డేట్స్‌ అడ్జెస్ట్‌ చేయడం ఏ రకంగా చూసినా కుదరదని అర్థం కావటంతోనే దీపికా ఆ సినిమాలో చాన్సును వదులుకుందట. ఇలా జరిగినందుకు దీపికా కూడా చాలా బాధపడుతున్నారని వార్తలు. షారుక్‌ నటించిన ‘ఓం శాంతి ఓం’ ద్వారా దీపిక హిందీకి కథానాయికగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆమె కెరీర్‌ పుంజుకోవడం, ప్రస్తుతం టాప్‌ హీరోయిన్స్‌లో ఒకరిలా దూసుకెళ్లడం జరిగాయి. అందుకే షారుక్‌ అంటే దీపికాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కాని వృత్తిపరమైన కమిట్‌మెంట్ అనివార్యంగా షారుక్‌కు నో చెప్పడానికి కారణమైంది
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments