Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపిక పడుకోనె "చఫాక్" సినిమాకు కొత్త చిక్కులు

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (16:42 IST)
బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోనే ఒక ఛాలెంజింగ్ పాత్ర ద్వారా 'ఛపాక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఢిల్లీలో యాసిడ్ దాడికి గురైన బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతోంది. షూటింగ్‌లో దీపిక పదుకోనె, విక్రాంత్ మాస్సేపై తీస్తున్న కీలక సీన్లు కొన్ని సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. గ్రీన్ కలర్ కుర్తా, సల్వార్ ధరించిన దీపిక ఆటోలో నుంచి దిగుతున్న దృశ్యాలు మీడియా వైరల్ అవుతున్నాయి.
 
గతంలో కూడా ఇలాగే 'ఛపాక్' సినిమాకు సంబంధించిన సీన్లు కొన్ని లీక్ అయ్యాయి. దీపిక, విక్రాంత్‌పై ఢిల్లీ మార్కెట్లో ఏదో దుకాణం ముందర చిత్రీకరించిన సీన్లు లీక్ అయ్యాయి. షూటింగ్ సంబంధించిన చాలాభాగం పబ్లిక్ ప్రదేశాలలో జనసమూహం మధ్య జరుగుతుండటంతో వీటిని ఆపడం ఎవరితరం కావట్లేదు. మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహిస్తున్న 'ఛపాక్' సినిమాకు దీపిక కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. 
 
ఈ సినిమా గురించి దీపిక మాట్లాడుతూ 'గాయపడి, గెలిచిన ఓ వ్యక్తి కథ. మనిషికి ఉండే బలమైన ఆత్మవిశ్వాసాన్ని తెలియజేసే ఇలాంటి కథను చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ భాగస్వామ్యంతో ఈ సినిమా రాబోతోందని పేర్కొన్నారు. ఈ సినిమా వచ్చే యేడాది జనవరి 10వ తేదీన విడుదలకానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments