Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి ఎలా స్పృహ తప్పి పడిపోయిందో చెప్పరా? సోషల్ మీడియాలో ప్రశ్నలు

దివంగత నటి శ్రీదేవి మరణాన్ని ఆమె అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవి మరణించి రోజులు గడిచినా.. ఆమెది సహజమరణమేనా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్పృహ తప్పిపోయి బాత్‌లో పడి శ్రీదేవి

Webdunia
శనివారం, 3 మార్చి 2018 (11:30 IST)
దివంగత నటి శ్రీదేవి మరణాన్ని ఆమె అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవి మరణించి రోజులు గడిచినా.. ఆమెది సహజమరణమేనా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్పృహ తప్పిపోయి బాత్‌లో పడి శ్రీదేవి మృతి చెందిందని సౌదీ ప్రాసిక్యూషన్ చెప్పడంపై సంతృప్తి చెందట్లేదు.

ఫిబ్రవరి 24 రాత్రి దుబాయ్‌లోని ఒక హోటల్‌లో శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్‌ టబ్‌లో పడి మృతి చెందారని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో.. ఆ నివేదికలో ఆమె స్పృహ తప్పిపోవడానికి గల కారణాలను ఎందుకు వివరించలేదని.. అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
 
వివాహ వేడుకలో సరదాగా గడిపిన శ్రీదేవి ఎలా స్పృహ తప్పి పడిపోయిందని వారు అడుగుతున్నారు. కనీసం కుటుంబ సభ్యులు కూడా దీనిపై ఎందుకు స్పందించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా శ్రీదేవి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో అగ్ర నటిగా కొనసాగిన సంగతి తెలిసిందే.

పెళ్లయ్యాక సినిమాలకు దూరమైన శ్రీదేవి.. ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఓ గృహిణిగా చీరకట్టులో అద్భుతమైన నటనతో ఆకట్టుకుని.. బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆపై మామ్ చిత్రంలోనూ తనదైన శైలిలో నటనతో అదుర్స్ అనిపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments