Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెక్కన్ ఫిల్మ్ "హౌలా" హంగామా మొదలు!

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (16:25 IST)
హైద‌రాబాద్ కేంద్రంగా ఇప్పుడిప్పుడే మెల్లగా విస్తరిస్తున్న డెక్కన్ సినిమాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని ప్రముఖ డెక్కన్ వుడ్ దర్శకుడు సయ్యద్ హుస్సేన్ కోరారు. ఎంతో మంది క‌ళాకారుల‌కు ఉపాధి కల్పిస్తున్న ఈ పరిశ్రమకు రాయితీలివ్వాలని విజ్ఞప్తి చేశారు

ప్రస్తుతం హిందీలో రెండు చిత్రాలు రూపొందిస్తున్న ప్రముఖ డెక్కన్ వుడ్ దర్శకుడు సయ్యద్ హుస్సేన్. హైద్రాబాద్ హిందీ ఫిల్మ్ "హౌలా" చిత్ర ప్రారంభోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఎస్.కె.ఎంట్రప్రైజస్ పతాకంపై సిరాజ్ అహ్మద్ సమర్పణలో షమీమ్ అహ్మద్-మహ్మద్ ఖాదర్ జిలాని నిర్మిస్తున్న ఈ హిలేరియస్ న్యూ ఏజ్ ఎంటర్టైనర్ కు బాలీవుడ్ దర్శకుడు కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

డెక్కన్ సూపర్ స్టార్ అద్నాన్ సాజిద్ ఖాన్ (గుల్లు దాదా), ప్రీతి నిగమ్, సనా ఖాన్, అజీజ్ రిజ్వాన్, నిషా సింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హైద్రాబాద్లోని సెన్సేషన్ థియేటర్ లో ఎంతో హంగామాగా మొదలైన ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో సయ్యద్ హుస్సేన్ తోపాటు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ హీనా షేక్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

సినిమాలోని పాత్రలన్నీ సీరియస్ గా నటిస్తుంటే, సదరు సీరియస్ నెస్ ఆడియన్స్ కు కడుపుబ్బ నవ్వించే కామెడీ పండించడం "హౌలా" ప్రత్యేకత అని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

ఆస్తి కోసం కుమార్తె చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి!!

మార్క్ శంకర్ పవనోవిచ్‌ను కాపాడిన వారిని సత్కరించిన సింగపూర్

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments