Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడుదలకు సిద్దమవుతోన్న సుమయ రెడ్డి డియర్ ఉమ

డీవీ
బుధవారం, 17 జనవరి 2024 (09:31 IST)
Sumaya Reddy
ఓ తెలుగు అమ్మాయి తెరపై హీరోయిన్‌గా కనిపించడం.. అందులోనూ నిర్మాతగా వ్యవహరించడం.. దానికి మించి అన్నట్టుగా కథను అందించడం అంటే మామూలు విషయం కాదు. అలా మల్టీ టాలెంటెడ్‌గా సుమయ రెడ్డి అందరినీ ఆకట్టుకోనున్నారు. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద డియర్ ఉమ అనే చిత్రం రాబోతోంది. ఇందులో సుమయ రెడ్డి, దియ మూవి ఫేమ్ పృథ్వీ అంబర్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీకి సుమయ రెడ్డి నిర్మాతగా  వ్వవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు చూసుకుంటున్నారు.
 
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు చక్కని సందేశాన్ని ఇవ్వబోతున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ సినిమాను నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కూడా నిర్మించారు. టీజర్ రిలీజ్ చేసిన తరువాత సినిమా స్థాయి ఏంటో అందరికీ తెలుస్తుందని మేకర్లు చెబుతున్నారు. లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు త్వరలోనే థియేటర్లోకి రానుందని దర్శక నిర్మాతలు తెలిపారు.
 
రాజ్ తోట కెమెరామెన్‌గా, రధన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్న ఈ చిత్రంలో కమల్ కామరాజు, సప్త గిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూప లక్ష్మీ వంటి వారు నటించారు.
 
నటీనటులు : సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్,  కమల్ కామరాజు, సప్త గిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూప లక్ష్మీ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

సాయుధ దళాల్లో పని చేసే జంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య

ఐవీఎఫ్‌కి తండ్రి.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కమలా హారిస్

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్

చట్టం ఇకపై గుడ్డిది కాదు : న్యాయ దేవతకు కొత్త రూపు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments