Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

డీవీ
శనివారం, 18 మే 2024 (17:22 IST)
Sumaya Reddy
సుమయా రెడ్డి అనే ఓ తెలుగు అమ్మాయి ‘డియర్ ఉమ’ అంటూ మొదటి సినిమాతోనే నిర్మాతగా మారడం, కథను అందించడం, హీరోయిన్‌గా నటించడం అంటే మామూలు విషయం కాదు. ఇలా అన్నీ తానై ఓ లేడీ బాస్‌గా సినిమాను ముందుకు నడిపిస్తోంది. డియర్ ఉమ సినిమాతో సుమయా రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
 
సుమయా రెడ్డి, పృథ్వీ అంబర్ హీరో హీరోయిన్లుగా సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద సుమయా రెడ్డి నిర్మించిన చిత్రం డియర్ ఉమ. ఈ చిత్రానికి సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, నవ్వుతుంటనే లిరికల్ వీడియో సాంగ్ ద్వారా సినిమాలోని ఫీల్ గుడ్ ఎమోషన్‌కు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. అందమైన ప్రేమ కథా చిత్రంగా డియర్ ఉమ అందరినీ ఆకట్టుకునేలా ఉందని అంతా ఫిక్స్ అయ్యారు.
 
సుమయా రెడ్డి పుట్టిన రోజు (మే 18) సందర్భంగా చిత్రయూనిట్ ఆమెకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపారు. అన్నీ తానై నడిపిస్తున్న తమ లేడీ బాస్‌కు చిత్రయూనిట్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్‌ను గద్దె దించాను.. చిరకాల ధ్యేయం నెరవేరింది.. రేవంత్ రెడ్డి

బంగారు విగ్రహాలతో అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ వెడ్డింగ్ కార్డ్- వైరల్

ఆ వార్త విన్నాకే రామోజీ రావు పరమపదించారు.. పవన్ కల్యాణ్ (video)

అమరావతి నిర్మాణానికి రూ.10కోట్లు విరాళం: ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌ (video)

ఓమ్నీ కారు నడిపిన గులాబీ పార్టీ హీరో.. నెట్టింట ఫోటో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

తర్వాతి కథనం
Show comments