విజయ్ దేవరకొండ టాలీవుడ్ 'ముద్దుల' హీరో... నవ్వుతున్న రష్మిక

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (13:13 IST)
విజయ్ దేవరకొండ, రష్మిక జోడి కట్టిన విషయం అందరికీ తెలిసిందే. 'గీత గోవిందం' చిత్రంలో వీరిద్దరి నటనకు ప్రతి ఒక్కరూ వీరికి ఫ్యాన్స్‌గా మారిపోయారు. అలాంటిది.. ఇప్పుడు మళ్లీ 'డియర్ కామ్రేడ్‌' చిత్రంలో రష్మిక, విజయ్‌కి జోడిగా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ ముద్దు సీన్ సోషల్ మీడియాలో లీక్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
 
తాజాగా ఈ లీక్‌పై రష్మిక స్పందిస్తూ.. లిప్‌లాక్ సీన్‌తో సినిమాని అంచనా వేయడం అంత మంచిది కాదు.. పాత్ర డిమాండ్ చేసింది. కనుకనే నేను నా పాత్రకు న్యాయం చేశానని చెప్పారు. గీత గోవిందాన్ని ఆదరించినట్టుగానే ఈ చిత్రాన్ని కూడా అలాగే ఆదరిస్తారనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.
 
ఈ ముద్దు సీన్‌లో రష్మికతో పాటు ట్రోల్ అయిన విజయ్ దేవరకొండ కూడా దానిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. తను నటించిన 'అర్జున్‌రెడ్డి' నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న 'డియర్ కామ్రేడ్' సినిమాల వరకు లిప్‌లాక్ లేకుండా ఒక్క సినిమా కూడా లేదు. దీంతో అందరూ విజయ్‌ని ముద్దుగా టాలీవుడ్ ఇమ్రాన్ హష్మీగా పిలుచుకుంటున్నారు. కానీ, విజయ్ మాత్రం ఇప్పటివరకు వస్తున్న వార్తలపై నోరు మెదపలేదు.
 
డియర్ కామ్రేడ్ సినిమా విషయానికొస్తే.. కాలేజీ నేపథ్యంలో సాగే పొలిటికల్ డ్రామా కథ ఇది. విజయ్ దేవరకొండ, రష్మిక విద్యార్థి నాయకులుగా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మే 31వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు సాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments