Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతులు కాలాకా ఆకులు ప‌ట్టుకోవ‌డం అంటే ఇదే డియర్ కామ్రేడ్

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (12:02 IST)
సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ తాజా చిత్రం డియ‌ర్ కామ్రేడ్. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. ఇటీవ‌ల విడుద‌లైన‌ ఈ సినిమాకి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ.. క‌లెక్ష‌న్స్ మాత్రం బాగానే ఉన్నాయంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. 
 
ఈ మీడియా మీట్లో చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన న‌వీన్ ఎర్నేని మాట్లాడుతూ... విడుదలైన ఈ మూడు రోజుల్లో మంచి వసూళ్లు వచ్చాయి. మూడు రోజులకు గాను 21 కోట్ల షేర్ రాబట్టింది. గ్రాస్‌లో చూసుకుంటే 30 కోట్లకు పైగా రాబట్టింది. హీరో విజయ్‌కున్న క్రేజ్ నేపథ్యంలో భారీ వసూళ్లు రావడం నిర్మాతలుగా మాకు ఆనందంగా ఉంది. 
 
అటు ఓవర్సీస్‌లో కూడా భారీ కలెక్షన్స్ ఉన్నాయి. అలాగే ఇతర భాషల్లో కూడా మంచి వసూళ్లు రావడం విశేషం.. ఈ రోజు వీకెండ్ తరువాత కూడా అదే కలెక్షన్స్ రావడంతో బయ్యర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. అలాగే ఈ సినిమా నిడివి విషయంలో స్లోగా ఉందంటూ కామెంట్స్ రావడంతో 13 నిమిషాల సినిమాను ఎడిట్ చేసాం. 
 
అలాగే ఇప్పటికే ఈ సినిమాలో క్యాంటీన్ సాంగ్ బాగా పాపులర్ అయింది. నిడివి దృష్ట్యా దాన్ని పెట్టలేదు. చాలామంది కావాలని కోరుకోవడంతో నేటినుండి ఆ సాంగ్‌ని జోడించాం. ఆ పాటతో సినిమాకు ఇంకాస్త ఊపు ఇస్తుందని భావిస్తున్నాం అన్నారు. చేతులు కాలాకా ఆకులు ప‌ట్టుకోవ‌డం అంటే ఇదేనేమో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments