Webdunia - Bharat's app for daily news and videos

Install App

'డియర్ కామ్రేడ్' హిందీ డబ్బింగ్‌‌కు భారీ రెస్పాన్స్.. 160 మిలియన్ వ్యూస్

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (12:23 IST)
Dear Comrade
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ''డియర్ కామ్రేడ్'' హిందీ డబ్బింగ్ సినిమాకు యూట్యూబ్‌లో భారీ స్పందన లభించింది. ఇటీవల కొన్ని తెలుగు చిత్రాలను అనువాదం చేసి హిందీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో అల్లు అర్జున్, రామ్ పోతినేని, బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాలు, నితిన్ సినిమాలు వందల మిలియన్ల వ్యూస్‌ను రాబట్టిన సంగతి తెలిసిందే.
 
తాజాగా డియర్ కామ్రేడ్ హిందీ అనువాదానికి యూట్యూబ్‌లో భారీ స్పందన లభిస్తుంది. ఈ చిత్రానికి 160 మిలియన్స్‌కి పైగా వ్యూస్ రాగా, 2 మిలియన్స్ లైక్స్ వచ్చాయి. ఇప్పటివరకు ఏ భారతీయ చిత్రానికి ఈ స్థాయిలో లైక్స్ రాలేదని అంటున్నారు.
 
గోల్డ్ మైన్స్ టెలి ఫిలింస్ సంస్థ హిందీ అనువాద హక్కులని కొనుగోలు చేసి ఈ ఏడాది జనవరి 19న యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమాకి 2 మిలియన్ లైక్స్ రావడంతో మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments