Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ సినిమా కోసం త్రివిక్రమ్‌ను సెలెక్ట్ చేసిన దాసరి..?

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2015 (11:33 IST)
టాలీవుడ్ సీనియర్ డైరక్టర్ దాసరి నారాయణ రావు- పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కేందుకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. పవన్ సినిమాను ప్రొడ్యూస్ చేసే బాధ్యతను దాసరి నారాయణ రావు తీసుకోవాలని భావిస్తున్నారు.

ఇక దర్శకత్వం బాధ్యతలను త్రివిక్రమ్ చేతిలో పెట్టాలని దర్శకరత్న ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అత్తారింటికి దారేది సినిమా హిట్ కావడంతో.. త్రివిక్రమ్ అయితేనే పవన్ సినిమాకు సరిపోతాడని దాసరి భావిస్తున్నారు.
 
ఇప్పటికే తెరవెనుక దాసరి-పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌కు సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్లు సమాచారం. త్వరలో పవన్ కోసం త్రివిక్రమ్ మళ్లీ మెగాఫోన్ పట్టుకోబోతున్నాడని సినీ జనం అనుకుంటున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ ముగించుకుని వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. 
 
కాగా త్రివిక్రమ్ నితిన్-సమంత హీరోహీరోయిన్లుగా నటించే సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సన్నాఫ్ సత్యమూర్తి ఫేమ్ ఎస్. రాధాకృష్ణన్ నిర్మాణ సారథ్యం వహించనున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments