Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి మృతిపై అనుమానాలున్నాయి.. మాకు ఆస్తిలో భాగం ఇవ్వలేదు: పెద్ద కోడలు సుశీల

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అంత్యక్రియలు పూర్తయిన 24 గంటలు కూడా గడవకముందే.. ఆయన మృతిపై అనుమానాలున్నాయంటూ పెద్ద కోడలు సుశీల ఆరోపించారు. దాసరి పెద్ద కుమారుడు ప్రభు భార్య సుశీల కావడం విశేషం. వారిద్ద

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (09:36 IST)
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అంత్యక్రియలు పూర్తయిన 24 గంటలు కూడా గడవకముందే.. ఆయన మృతిపై అనుమానాలున్నాయంటూ పెద్ద కోడలు సుశీల ఆరోపించారు. దాసరి పెద్ద కుమారుడు ప్రభు భార్య సుశీల కావడం విశేషం. వారిద్దరి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ  నేపథ్యంలో తమ కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయన్న మాట వాస్తవమే.. అయితే ఇంకా తనకు, తన భర్తకు విడాకులు కాలేదని సుశీల తెలిపారు.
 
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అసలు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా ఎలా? అనారోగ్యం పాలయ్యారు? గతంలో తాను వచ్చినప్పుడు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశానన్నారు. ఆసుపత్రి ఉండగా పరామర్శించేందుకు వచ్చే తనను కనీసం ఆయన్ని చూసేందుకు కూడా అనుమతించలేదని సుశీల చెప్పారు. మే 4న మామగారిని చూసేందుకు వెళ్తే.. ఆయన ప్రేమగా మాట్లాడారు.
 
అంతేకాదు.. తన కొడుకును సినీ రంగానికి పరిచయం చేస్తానని మాటిచ్చారని సుశీల వెల్లడించారు. తమకు ఆస్తిలో భాగం ఇవ్వలేదని సుశీల తెలిపారు. ఎంతోమందికి జీవితాలిచ్చానని మీకు అన్యాయం చేయనని.. రెండు వారాల తర్వాత రండి.. తప్పకుండా న్యాయం చేస్తానని మామయ్య హామీ ఇచ్చారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫేస్‌బుక్‌లో టిటిడి ఈఓ పేరిట మోసం.. అప్రమత్తంగా వుండాలంటున్న విజిలెన్స్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలి.. చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చిన రేవంత్

Prashant Kishor: కారు మీద పడిన జనం.. కారు డోర్ తగిలి ప్రశాంత్ కిషోర్‌కు తీవ్రగాయం.. ఏమైందంటే? (video)

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఇంట్లోనే వుండండి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ (video)

Hyderabad floods: హైదరాబాదులో భారీ వర్షాలు- హుస్సేన్ సాగర్ సరస్సులో భారీగా వరదలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments