Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమీర్ ఖాన్ "దంగల్" మూవీ కలెక్షన్స్ ... మూడు రోజుల్లో.. రూ.106 కోట్లు!

బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ మరోమారు సిల్వర్ స్క్రీన్‌పై తన సత్తా చాటాడు. ఆమీర్ ఖాన్ తాజా చిత్రం "దంగల్" కనక వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు రోజుల్లో రూ.106.95 కోట్లు వసూలు చేసింది.

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (16:18 IST)
బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ మరోమారు సిల్వర్ స్క్రీన్‌పై తన సత్తా చాటాడు. ఆమీర్ ఖాన్ తాజా చిత్రం "దంగల్" కనక వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు రోజుల్లో రూ.106.95 కోట్లు వసూలు చేసింది. 
 
ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో దేశవ్యాప్తంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూడు రోజుల్లో రూ.106.95 కోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. 'దంగల్‌' అరుదైన మైలురాయిని దాటిందని, కొత్త రికార్డును సృష్టించిందని ట్వీట్‌ చేశారు. 
 
దేశవ్యాప్తంగా శుక్రవారం (తొలిరోజు) రూ.29.78 కోట్లు, శనివారం రూ.34.82 కోట్లు రాబట్టిన ఈ చిత్రం ఇక ఆదివారం రూ.42.35 కోట్లు వసూలు చేయడం విశేషం. కాగా, దేశవ్యాప్త కలెక్షన్స్‌లో ఆమిర్‌ ఖాన్‌ చిత్రాల్లో రూ.100 కోట్లు దాటినవి గత 2008- 'గజిని', 2009- 'త్రీ ఈడియట్స్‌', 2013- 'ధూమ్‌-3', 2014- 'పీకే'లు ఉండగా, ఇపుడు దంగల్ ఉంది. 
 
ప్రముఖ భారతీయ రెజ్లర్ మహవీర్ సింగ్ పొగట్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను అందుకుంది. ఈ చిత్రంలో ఆమీర్ ఖాన్ నటన, కూతురి పాత్రలు పోషించిన ఫాతిమా, సాన్యా మల్హోత్ర నటనకు జనం నీరాజనం పట్టారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments