Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.376.14 కోట్లు వసూలు చేసిన అమీర్ ఖాన్ దంగల్.. వినోదపు పన్ను కట్..

అమీర్ ఖాన్ నటించిన దంగల్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. ఏకంగా రూ.376.14 కోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నారు. మల్లయోధుడు మహవీర్‌

Webdunia
శనివారం, 21 జనవరి 2017 (19:43 IST)
అమీర్ ఖాన్ నటించిన దంగల్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. ఏకంగా రూ.376.14 కోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నారు. మల్లయోధుడు మహవీర్‌సింగ్‌ ఫొగాట్‌ జీవితగాథ ఆధారంగా నితీశ్‌ తివారీ దీన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిరోజు నుంచే బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకుంది. 
 
ఇక విడుదలైన రెండో రోజే రూ.50కోట్లు వసూలు చేసింది. మూడు రోజుల్లో రూ.100కోట్లు.. ఎనిమిది రోజుల్లో రూ.200కోట్లు.. 13రోజుల్లో రూ.300కోట్లు.. 29 రోజుల్లో రూ.375 కోట్లను 'దంగల్‌' వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లోనూ దంగల్‌ కలెక్షన్ల పరంపర కొనసాగిందని తరుణ్ ఆదర్శ్ తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా జనవరి 20 నాటికి 29.04 మిలియన్ డాలర్లు (రూ.197.70 కోట్లు) వసూలు చేయడం విశేషం. ఒక్క యూఎస్‌ఏ, కెనడాలలో 12 మిలియన్ల కలెక్షన్లు రాబట్టింది. ఇదిలా ఉంటే.. దంగల్ చిత్రానికి మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో వినోదపు పన్నును మినహాయిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. ఈ చిత్రాన్ని శుక్రవారం రాత్రి ఆయన తన సతీమణి సాధనతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభుత్వం దంగల్‌ చిత్రానికి వినోదపు పన్ను మినహాయిస్తుందన్నారు.
 
దీంతో పాటు రెజ్లింగ్‌ను ప్రోత్సహించేందుకు మధ్యప్రదేశ్‌లో ప్రత్యేకంగా అకాడమీని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. దీంతో 'జై గంగాజల్‌', 'నీర్జా', 'మర్దాని' చిత్రాల తర్వాత వినోదపు పన్ను మినహాయింపు ప్రకటించిన నాలుగో చిత్రంగా దంగల్‌ నిలిచింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments