Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమీర్ "దంగల్" కలెక్షన్ల వర్షం ... 13 రోజుల్లో రూ.300 కోట్ల వసూలు

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తాజా చిత్రం 'దంగల్'. ఈచిత్రం విడుదలైనప్పటి నుంచి కనకవర్షం కురిపిస్తోంది. పైగా.. భారతీయ చలన చిత్ర రికార్డులను తిరగరాస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే దంగల్ కలెక్షన్స్ రూ.300కోట

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (06:19 IST)
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తాజా చిత్రం 'దంగల్'. ఈచిత్రం విడుదలైనప్పటి నుంచి కనకవర్షం కురిపిస్తోంది. పైగా.. భారతీయ చలన చిత్ర రికార్డులను తిరగరాస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే దంగల్ కలెక్షన్స్ రూ.300కోట్లని క్రాస్ చేసింది. ఇది కేవలం ఇండియా కలెక్షన్స్ మాత్రం. ఓవర్సీస్‌లో దంగల్ ఇప్పటివరకు రూ.160 కోట్లు కలెక్ట్ చేసింది.
 
భారత రెజ్లింగ్‌ యోధుడు మహవీర్‌సింగ్‌ ఫోగట్‌ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మహావీర్ సింగ్ తన కుమార్తెలని ఎలా తీర్చిదిద్దారు అనే కథాంశంతో దంగల్ తెరకెక్కింది. రెజ్లింగ్‌ క్రీడాకారుడిగా, తన కూతుళ్లకు రెజ్లింగ్ నేర్పించే తండ్రిగా.. రెండు విభిన్నమైన పాత్రలో అమీర్ ఆకట్టుకొన్నాడు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన అమీర్ 'దంగల్' డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెల్సిందే. 
 
భారత్‌లో విడుదలైన అతి తక్కువ కాలంలో రూ.300 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రంగా దంగల్ రికార్డ్ సృష్టించింది. గతంలో అమీర్ నటించిన 'పీకే' 17 రోజుల్లో రూ.300 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు 'దంగల్' 13 రోజుల్లోనే రూ.300 కోట్లు వసూలు చేసింది. భారత్‌లో రూ.300 కోట్లు వసూలు చేసిన చిత్రాల్లో సల్మాన్ "భజరంగీ భాయ్ జాన్", "సుల్తాన్", "పీకే", "దంగల్" మాత్రమే ఉన్నాయి. 300క్లబ్‌లో సల్మాన్, అమీర్ చిత్రాలు మాత్రమే ఉండటం విశేషం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments