Webdunia - Bharat's app for daily news and videos

Install App

'డాకు మహారాజ్‌' మనందరి సినిమా.. ఆదరించండి : నిర్మాత నాగవంశీ

ఠాగూర్
ఆదివారం, 5 జనవరి 2025 (08:58 IST)
యువరత్న బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'డాకు మహారాజ్'. ఈ నెల 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలకానుంది. ఈ చిత్ర నిర్మాత నాగవంశీ ఎక్స్ వేదికగా స్పందించారు. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ కావడానికి ప్రయత్నిద్దామని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
'ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్టు చాలా అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ కావడానికి ప్రయత్నిద్దాం' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
నాగవంశీ నిర్మాణంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం 'డాకు మహారాజ్' సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇప్పటికే వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. అయితే ఈ సినిమాలోని 'దబిడి దిబిడి' పాటపై నెట్టింట ట్రోల్స్ వస్తున్న విషయం తెలిసిందే. మరో పక్క నందమూరి కుటుంబంలో నెలకొన్న గొడవల కారణంగా బాలకృష్ణ, తారక్ దూరంగా ఉంటూ వస్తున్నారు.
 
తారక్ దేవర సినిమా విడుదల సమయంలో బాలకృష్ణ ఏ విధంగా స్పందించకపోవడంతో వారి ఇరువురి ఫ్యాన్స్ మద్య వివాదం మరింత పెరిగింది. దీంతో బాలకృష్ణ 'డాకు మహారాజ్‌'ను తారక్ అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే డాకు మహారాజ్‌పై నెటిజన్లు నెగిటివ్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో నిర్మాత నాగవంశీ డాకు మహారాజ్ మువీకి సంబంధించి పోస్టు చేయడం ఆసక్తికరంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments