Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాను బ‌ట్టి రివ్యూ ఉంటుంది... క‌క్షతో రివ్యూలు రాస్తామా? : మహేశ్ కత్తి

సినిమాను బ‌ట్టి రివ్యూ ఉంటుంది కానీ, సినిమాల‌పై క‌క్షతో రివ్యూలు రాస్తామా? అని నిల‌దీశారు. అభ‌ద్ర‌తా భావంతోనే త‌మ‌పై కొంద‌రు సినిమావారు ఇటువంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తి అ

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (09:00 IST)
సినిమాను బ‌ట్టి రివ్యూ ఉంటుంది కానీ, సినిమాల‌పై క‌క్షతో రివ్యూలు రాస్తామా? అని నిల‌దీశారు. అభ‌ద్ర‌తా భావంతోనే త‌మ‌పై కొంద‌రు సినిమావారు ఇటువంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తి అన్నాడు.
 
రివ్యూల‌పై వ‌స్తోన్న వివాదంపై మ‌హేశ్ క‌త్తి స్పందించారు. ముఖ్యంగా, జూనియర్ ఎన్టీఆర్ నటించిన "జై లవ కుశ" చిత్రంపై తాను రాసిన సమీక్ష వివాదాస్పదమైన విషయం తెల్సిందే. దీనిపై ఆయన స్పందిస్తూ, తాము కూడా ప్రేక్ష‌కులలాంటి వారిమేన‌ని, కాక‌పోతే సినిమాల‌ను విశ్లేషించ‌గ‌ల‌మ‌ని అన్నారు. సినిమాను ప్రేమించాం కాబ‌ట్టే తాము విశ్లేష‌కులమ‌య్యామ‌ని అన్నారు. 
 
విశ్లేష‌కుల‌ను వ‌చ్చి సినిమా తీయ‌మ‌నండ‌ని కొంద‌రు అంటున్నార‌ని, త‌మ ప‌ని సినిమాను విశ్లేషించ‌డ‌మేనని అన్నారు. సినిమా బాగుంటే బాగుంద‌ని, లోపాలు ఉంటే ఉన్నాయని రాస్తామ‌ని అన్నారు. అంతేగాని, సినిమా గురించి అన్నీ తెలుస‌ని తామేం విర్ర‌వీగ‌డం లేద‌ని అన్నారు. 
 
ఉదాహరణకు గ‌త యేడాది 'బిచ్చ‌గాడు' అనే సినిమా వ‌చ్చింద‌ని, ఆ సినిమాపై ఒక్క‌రు కూడా రివ్యూలు రాయ‌లేద‌ని, ఆ సినిమా సూప‌ర్ హిట్ అయింద‌ని సినీ విశ్లేష‌కుడు మ‌హేశ్ క‌త్తి అన్నారు. అలాగే 'పెళ్లి చూపులు' అనే సినిమా వ‌చ్చింద‌ని దానిపై అంద‌రు రివ్యూలు బాగానే రాశార‌ని, 'అర్జున్ రెడ్డి' సినిమాపై కూడా రివ్యూలు బాగానే రాశార‌ని, ఆ సినిమాల‌పై ఎవ‌రైనా కక్ష ‌గట్టి రివ్యూలు రాశారా? అంటూ ప్రశ్నించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుపు కాదు.. నలుపు కాదు.. బ్రౌన్ షర్టులో నారా లోకేష్.. పవన్‌ను అలా కలిశారు.. (video)

గోవాలో నూతన సంవత్సర వేడుకల కోసం వెళ్లిన యువకుడిని కర్రలతో కొట్టి చంపేసారు, ఎందుకు?

కుంభమేళా అంటే ఏమిటి? దేశంలో నాలుగు చోట్ల మాత్రమే ఎందుకు జరుగుతుంది

మున్సిపల్ యాక్ట్ రద్దు.. అమరావతిలో ఇంజనీరింగ్ కాలేజీలు.. ఏపీ కేబినెట్ నిర్ణయం

మెగా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌పై ఏపీ కేబినేట్ సమీక్ష- రూ.2,733 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments