Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్తి మహేష్‌పై క్రిమినల్ కేసు... ఎందుకో తెలుసా?

ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని రహ్మత్‌ నగర్‌కు చెందిన గడ్డం శ్రీధర్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఈ తరహా కేసును నమోదు చేశారు.

Webdunia
శనివారం, 8 సెప్టెంబరు 2018 (11:15 IST)
ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని రహ్మత్‌ నగర్‌కు చెందిన గడ్డం శ్రీధర్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఈ తరహా కేసును నమోదు చేశారు.
 
గత జూన్ నెల 29వ తేదీన ఓ టీవీ ఛానల్‌లో జరిగిన చర్చలో శ్రీరాముడు, సీతపై మహేశ్‌ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలనే ఆయన మరోమారు ప్రస్తావిస్తూ ఫిర్యాదుచేశారు. 
 
ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మహేశ్‌ మాట్లాడినట్లు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుపై తొలుత న్యాయ సలహా తీసుకున్న పోలీసులు.. ఐపిసి 295 (ఎ), 505 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
 
కాగా, ఈ వ్యాఖ్యల కారణంగా కత్తి మహేష్‌పై హైదరాబాద్ నగర పోలీసులు ఆర్నెల్ల పాటు నగర బహిష్కరణ చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆయనన కొద్ది రోజులుగా తన సొంత జిల్లా చిత్తూరులో ఉంటూ వచ్చారు. ఇటీవలే తన నివాసాన్ని విజయవాడకు మార్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments