Webdunia - Bharat's app for daily news and videos

Install App

పృథ్వీరాజ్‌తో సహా బ్లెస్సీ యూనిట్.. ఎడారిలో చిక్కుకుపోయింది.. ఆకలితో..?

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (12:35 IST)
Prithivraj
మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ హీరోగా, బ్లెస్సీ ద‌ర్శ‌క‌త్వంలో 'ఆడు జీవితం' పేరిట ఓ చిత్ర నిర్మాణం మొదలైంది. కథలో భాగంగా సినిమా షూటింగ్‌ను జోర్డాన్ ఎడారిలో జరపాలని భావించారు. అక్క‌డి ప‌రిస్థితులు బాగోలేవ‌ని కొందరు చెప్పినా, చిత్ర యూనిట్ వినకుండా అక్కడికి వెళ్లింది. చివరికి అక్కడికి వెళ్లిన తరువాత క‌రోనా తీవ్ర‌రూపం దాల్చింది. 
 
భారత దేశంతో పాటు పలు దేశాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.. విమానాలు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో, వారంతా అక్కడే చిక్కుకుపోయారు. తిండి లేక నానా ఇబ్బంది పడుతున్నారట. తమను ఎలాగైనా భారత్‌కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని యూనిట్ సభ్యులు కోరుతున్నారు. 
 
జోర్డాన్‌లోని ఎడారి ప్రాంతంలోకి వెళ్లిన బ్లెస్సీ యూనిట్.. ఎటూ కదిలే దారి లేక, యూనిట్ మొత్తం ఆకలి బాధలు పడుతోందట. వారిని ఎలాగైనా వెనక్కు రప్పించాలని మాలీవుడ్ ప్రముఖులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నటుడు పృథ్వీరాజ్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఏప్రిల్ 2వ తేదీ వరకు ముందుగా ప్లాన్ చేసుకున్న రీతిలో వసతి, ఆహారం, సామాగ్రి వుందని.. కానీ ఆ తర్వాత ఏమౌతుందో ఏమోనని తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments