Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంగవీటి సినిమాపై వెనక్కి తగ్గిన వర్మ: కమ్మ కాపు.. పాటను తొలగించినట్లు ట్వీట్.. పిటిషన్ కొట్టివేత

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెనక్కి తగ్గాడు. విజయవాడ రౌడీయిజం, రాజకీయాల నేపథ్యంలో రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా వంగవీటి. యధార్థ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో వివాదాస్పద

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (15:22 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెనక్కి తగ్గాడు. విజయవాడ రౌడీయిజం, రాజకీయాల నేపథ్యంలో రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా వంగవీటి. యధార్థ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో వివాదాస్పద అంశాలను వర్మ ప్రస్తావించారు. అంతేకాదు సినిమా మొదలైన సమయంలోనే కమ్మ కాపు అంటూ రిలీజ్ చేసిన సాంగ్ వివాదాస్పదమైంది.
 
ఈ నేపథ్యంలో విజయవాడ చరిత్రను వక్రీకరించారంటూ కొంత మంది కోర్టును ఆశ్రయించారు. విజయవాడలో ముఖ్యంగా కుల విద్వేశాలను రెచ్చగొట్టేవిధంగా ఉన్న కమ్మ కాపు పాటను సినిమాను నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కేసు విచారించిన హైకోర్టు చిత్ర దర్శకుడు రాం గోపాల్ వర్మతో పాటు, నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌లకు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా కోర్టు తీర్పు వెలువడే వరకు ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
దీంతో ఇప్పటికే నోట్ల రద్దుతో కష్టాలు తప్పవని భావించిన వర్మ అండ్ టీమ్ డిసెంబర్ 23న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తోంది. అందుకే వర్మ ఈ పాట విషయంలో వెనక్కి తగ్గింది. వివాదానికి కారణమైన పాటను సినిమా నుంచి తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది. 'వంగవీటి' చిత్రంలోని 'కమ్మ కాపు..' అనే పాటను తీసేసినట్లు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్ ద్వారా  స్పష్టం చేశారు. కొందరి సెంటిమెంట్స్‌ను గౌరవిస్తూ ఈ పాటను తీసేస్తున్నట్లు వర్మ తాజాగా ట్వీట్‌ చేశారు. భావోద్వేగాలతో కూడిన చిత్రమని, ఎవర్నీ అప్రతిష్ఠపాలు చేయదని వివరణ ఇచ్చుకున్నాడు. దీంతో అనుకున్నట్టుగా రాంగోపాల్ వర్మ వంగవీటి డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ శనివారం ఈ చిత్ర ఆడియోను విజయవాడలోనే వర్మ విడుదల చేయనున్నారు.
 
మరోవైపు విజయవాడలో జరిగిన ఫ్యాక్షన్‌ రాజకీయాల బ్యాక్ డ్రాప్ లో 'వంగవీటి' సినిమా వాస్తవానికి విరుద్ధంగా ఉందని వంగవీటి మోహనరంగా కొడుకు రాధాకృష్ణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్‌ను తొలగిస్తామని దర్శకుడు కోర్టుకు హామీ ఇవ్వడంతో ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హ్యాపీ బర్త్‌డే లోకేష్ సర్: విద్యార్థులు ఇంకోసారి ఇలా చేయొద్దు.. నారా లోకేష్ (video)

Sharmila or Jagan?: ఏపీలో కూటమి సర్కారుకు విపక్ష నేత ఎవరు? షర్మిలనా? జగనా?

Vijaya Sai Reddy: విజయ సాయి రెడ్డి గారూ.. ఇది ధర్మమా? బండ్ల గణేష్ ప్రశ్న

ఇన్‌స్టా పరిచయం.. ముగ్గురు యువకుల కోసం మైనర్ బాలికలు వెళ్లారు.. చివరికి?

లెట్ ది బీట్స్ డ్రాప్: రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ కోసం మీరు అనుసరించాల్సినవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments