Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ అన్నయ్యకు ఇచ్చిన తప్పుడు సలహా చెప్పనా? అది మీలో 0.1 శాతం కూడా లేదు : నాగబాబుకు వర్మ కౌంటర్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ గుంటూరులో ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఫంక్షన్ ఎంత గ్రాండ్‌గా జరిగినా.. పవన్ కల్యాణ్ రాకపోవడం, పవన్ అభిమానులు అసహనం ప్రదర్శించడం, చి

Webdunia
ఆదివారం, 8 జనవరి 2017 (16:37 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ గుంటూరులో ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఫంక్షన్ ఎంత గ్రాండ్‌గా జరిగినా.. పవన్ కల్యాణ్ రాకపోవడం, పవన్ అభిమానులు అసహనం ప్రదర్శించడం, చిరు కోపం ప్రదర్శించడం వంటి చిన్నచిన్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. 
 
వీటన్నింటికంటే... చిరు సోదరుడు నాగబాబు చేసిన కామెంట్స్ ఇపుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్ర నాథ్, డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మను ఉద్దేశించి తీవ్రమైన కామెంట్లే చేశారు. దానిపై యండమూరి కాస్తంత మెత్తగానే స్పందించినా.. వర్మ మాత్రం చాలా ఘాటుగా స్పందించాడు. ట్విట్టర్ వేదికగా నాగబాబుపై మండిపడ్డాడు. అతడు నాగబాబుపై చేసిన కామెంట్లు అతడి ట్వీట్లలోనే...
 
‘‘నాగబాబు సార్... మీకు ఇంగ్లిష్ అర్థం కాదు కాబట్టి చదువుకున్న మీ స్నేహితులతో నా ట్వీట్లను తెలుగులోకి తర్జుమా చేయించుకోండి’’
 
‘‘నాగబాబు సార్.. మీ అన్నయ్య చిరంజీవికి ఉన్న గొప్పతనంలో మీకు 0.1 శాతం కూడా లేదు. కాబట్టే మీలాగా అర్థం లేని అవాకులు చవాకులు ఆయన పేలరు’’
 
‘‘నాగబాబు సార్.. నేనేం చేయాలో నాకు చెప్పే బదులు మీ జీవితం కాని జీవితంలో మీరు సాధించిన జబర్దస్త్ కెరీర్ గురించి ప్రశ్నించుకోండి’’
 
‘‘నాగబాబు సార్.. ప్రజారాజ్యం పార్టీ విషయంలో మీరు మీ అన్నయ్యకు ఇచ్చిన తప్పుడు సలహా ఏంటో, ఆ తప్పుడు సలహాతో ఆయన ఎలా నష్టపోయారో యావత్ రాష్ట్రానికి తెలుసు’’
 
‘‘నాగబాబు సార్.. మీరు ఎంత ఎక్కువగా మాట్లాడితే నేను అన్ని ట్వీట్లు ఎక్కువగా పెడతాను. మీరు తెలుసుకోగలిగిన దాని కన్నా ఎక్కువే నాకు తెలుసు. మీలో ఎంత ఎక్కువ అతి ఉందో.. నాలో అతి అంత కన్నా ఎక్కువే ఉంది’’
 
‘‘నాగబాబు సార్.. ఖైదీ నంబర్ 150 ట్రైలర్ చూశాను. ట్రైలర్ చాలా చాలా ‘ఫెంటా............స్టిక్’. అవతార్ కన్నా కొంచెం బాగుంది’’
 
‘‘నాగబాబు సార్.. నా కెరీర్ వల్ల చాలా కుటుంబాలు బతుకుతున్నాయి. కానీ, మీ జీవితం మీ అన్నయ్య కుటుంబం మీదే ఆధారపడి ఉంది. మీకు కావాలంటే దీనిపై నేనింకా ట్వీట్లు చేయగలను’’
 
‘‘నాగబాబు సార్.. మీరు అక్కుపక్షుల మీద దృష్టి పెట్టడం కన్నా మీ సోదరులను సంతోషపెట్టడం నేర్చుకోండి. లేదంటే రోడ్డున పడడం ఖాయం. ఆల్ ద బెస్ట్’’
 
ఇలా ప్రతి ట్వీట్లోనూ ‘నాగబాబు సార్...’ అంటూ అతడిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ మండిపడ్డాడు రామ్‌గోపాల్ వర్మ. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

Taj Hotel: తాజ్ హోటల్, ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు

సింగపూర్‌లో స్విమ్మింగ్-12 ఏళ్ల బాలికను వేధించాడు.. చిప్పకూడు తింటున్నాడు..

బావ పొందు కోసం భర్తను రూ.50,000 సుపారి ఇచ్చి హత్య చేయించిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments