Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

ఠాగూర్
ఆదివారం, 20 జులై 2025 (19:05 IST)
ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నంపై పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి మండలికి రెండు వేర్వేరు ఫిర్యాదులు అందాయి. నైజాం ఏరియా పంపిణీకి సంబంధించి రెండు సినిమాలకుగానూ ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బును ఇప్పటివరకు చెల్లించలేదని ఆ ఫిర్యాదుల్లో ఆయా సంస్థల ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. 
 
రత్నం నిర్మాతగా తెరకెక్కించిన 'ఆక్సిజన్' మూవీకి సంబంధించి దాదాపు రూ.2.50 కోట్ల రివరీపై ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్, 'ముద్దుల కొడుకు', 'బంగారం' చిత్రాలకు సంబంధించిన రూ.90 వేల రికవరీపై మహాలక్ష్మి ఫిల్మ్స్ సంస్థలు ఫిర్యాదులు చేశాయి. రత్నం నిర్మించిన కొత్త సినిమా 'హరిహర వీరమల్లు' విడుదలకు ముందు ఆ బాకీ మొత్తం వసూలు చేయడంలో సహాయం చేయాలని అభ్యర్థించాయి. 
 
ఈ విషయంలో ఇతర పంపిణీదారులు  సహకరించాలని కోరారు. అయితే, ఈ ఫిర్యాదులు 'హరిహర వీరమల్లు' విడుదకు అడ్డంకిగా మారుతాయా? లేదా? అనేది తెలియాల్సివుంది. కాగా, పవన్ కళ్యాణ్ - నిధి అగర్వాల్ జంటగా నటించిన 'హరిహర వీరమల్లు' చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదలకానున్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి రత్నం కుమారుడు జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు.. డ్యాన్స్ చేయొద్దన్నా వినలేదు.. చివరికి?

Noida: స్నేహితుడిపై ప్రతీకారం కోసం పోలీసులకు ఫోన్ చేశాడట..ముంబైలో భయం

మీరట్‌లో నగ్న ముఠా హల్చల్ - మహిళలపై దాడులు

చనిపోయాడని అంత్యక్రియలు పూర్తి చేశారు.. మరుసటి రోజే తిరిగొచ్చిన ఆ వ్యక్తి!

యువకుడి ప్రాణం తీసిన మొబైల్ ఫోన్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments