Webdunia - Bharat's app for daily news and videos

Install App

'క్రిష్-3' చిత్రం కథను కాపీ కొట్టారు.. రాకేశ్‌ రోషన్‌పై కేసు నమోదు

Webdunia
సోమవారం, 23 మే 2016 (16:46 IST)
'క్రిష్-3' చిత్రం కథను కాపీ కొట్టినందుకు బాలీవుడ్ చిత్ర నిర్మాత రాకేష్ రోషన్‌పై ముంబైలో కేసు నమోదైంది. ఈ చిత్రంలో హీరోగా హృతిక్ రోషన్ నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమా కథను సూఅర్దాన్‌ అనే నవల నుంచి కాపీ కొట్టారంటూ రచయిత రూప్‌ నారాయణ్‌ సోంకార్‌ రాకేశ్‌పై కాపీరైట్‌ చట్టం కింద కేసు పెట్టారు. తాను రాసిన సూఅర్దాన్‌ పుస్తక కాపీలను కూడా పోలీసులకు అందజేశారు. 
 
కాగా, 2013లో వచ్చిన క్రిష్‌ సినిమాలో కూడా అచ్చం ఇలాంటి పాత్రే ఉంటుందని, తన అనుమతి లేకుండా తన కథను వారు కాపీ కొట్టారని రచయిత ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ముంబై పోలీసులు రాకేశ్‌పై కేసు నమోదు చేశారు. ఈ విషయమై రాకేశ్‌ని మీడియా ప్రశ్నిస్తే ప్రస్తుతం కేసు విచారణలో ఉందని దీనిపై ఏం మాట్లాడలేనని మెసేజ్‌ ద్వారా సమాధానమిచ్చారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments