Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాపై అలాంటి పుకార్లొస్తే నవ్వుకునేవాళ్లం: హెబ్బా పటేల్, రాజ్ తరుణ్

రాజ్‌తరుణ్‌తో మూడోసారి జతకట్టిన హెబ్బా పటేల్.. పుకార్లపై స్పందించింది. వీరిద్దరి కాంబోలో రూపుదిద్దుకుని శుక్రవారం విడుదల అంధగాడు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హెబ్బా, తర

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2017 (15:42 IST)
రాజ్‌తరుణ్‌తో మూడోసారి జతకట్టిన హెబ్బా పటేల్.. పుకార్లపై స్పందించింది. వీరిద్దరి కాంబోలో రూపుదిద్దుకుని శుక్రవారం విడుదల అంధగాడు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హెబ్బా, తరుణ్ మాట్లాడుతూ.. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పారు. తమ స్నేహం గురించి మీడియాలో వచ్చే వార్తలు చూసినవ్వుకుంటామని చెప్పింది. తాము కలిసి నటించిన సినిమాలు అభిమానులను అలరించడంతో ఏవేవో పుకార్లు పుట్టించారని హెబ్బా పటేల్ వివరణ ఇచ్చింది.
 
తామిద్దరి కాంబోలో హిట్స్ వచ్చాయని, తమ రిలేషన్ కూడా షూటింగ్ వరకేనని హెబ్బా తెలిపింది. సహనటులు ఎవరైనా సరే పాత్ర పోషణ కోసం వారితో సౌకర్యంగా ఉంటామని చెప్పింది. అంత మాత్రానికే లేనిపోని పుకార్లు పుట్టిస్తారని హెబ్బా పటేల్ వాపోయింది. రాజ్ తరుణ్ కూడా హెబ్బా పటేల్‌తో తనకు ప్రేమాయణం ఉందని వస్తున్న వార్తలను కొట్టిపారేశాడు. వెండితెరపై కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నామే కానీ.. తమ మధ్య వేరొక సంబంధం లేదన్నాడు. 
 
ఇదిలా ఉంటే.. 'అంధగాడు' సినిమాపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించాడు. రాజ్ తరుణ్ నటన అంధగాడులో ఆకట్టుకుందని చెప్పాడు. సినిమా మొత్తం రకరకాల మలుపులు తిరుగుతూ, ఆసక్తికరంగా కొనసాగుతుందని తెలిపాడు. సినిమా చాలా బాగుందని... చిత్రానికి సంబంధించిన టీమ్ మొత్తానికి అభినందనలు తెలియజేస్తున్నానన్నాడు. రాజ్ తరుణ్ నటన ఇతర సినిమాల కంటే అంధగాడులో విభిన్నంగా ఆకట్టుకునే రీతిలో ఉందని కితాబిచ్చాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments