డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హాస్య నటి భారతీ సింగ్ అరెస్టు!

Webdunia
ఆదివారం, 22 నవంబరు 2020 (11:49 IST)
బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన హాస్య నటి భారతీ సింగ్. ఈమె మాదకద్రవ్యాల కేసులో చిక్కుకుంది. భారతీ సింగ్‌ను ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు తర్వాత ఈ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కోణం వెలుగు చూసిన విషయం తెల్సిందే. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైకు చెందిన ఎన్సీబీ అధికారులు శనివారం భారతీ సింగ్ నివాసంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. అపుడు ఆమె ఇంట్లో నుంచి స్వల్ప మోతాదులో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఆపై భారతిని, ఆమె భర్త హర్ష్ లింబాచియాను తమ కార్యాలయానికి తరలించి, ప్రశ్నించిన అధికారులు, అరెస్ట్ చేస్తున్నట్టు వెల్లడించారు. అంధేరిలోని ఓ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్‌లో ఈ జంట నివాసం ఉంటోంది.
 
ఇక్కడ కనిపించిన దృశ్యాల ప్రకారం, భారతి ఎరుపు రంగు మెర్సిడిస్ బెంజ్ కారులో నార్కోటిక్స్ కార్యాలయానికి వెళ్లగా, లింబాచియాను ఎన్సీబీ అధికారులు, తమ వ్యాన్ లో తీసుకెళ్లారు. 
 
ఎన్సీబీ కార్యాలయంలోకి వారిని తీసుకెళ్లే ముందు, వారిని ప్రశ్నించేందుకే పిలిచామని వెల్లడించిన అధికారులు, విచారణ అనంతరం అదుపులోకి తీసుకుంటున్నట్టు తెలిపారు. డ్రగ్స్ సరఫరా, వాడకంలో వీరిద్దరి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోందని విచారణ అధికారి సమీర్ వాంఖడే మీడియాకు వెల్లడించారు.
 
కాగా, ఓ డ్రగ్ పెడ్లర్‌ను విచారిస్తుండగా, భారతీ సింగ్ పేరు బయటకు వచ్చిందని, ఆ తర్వాత వారి ఇంట్లో సోదాలు జరిపామని మరో ఎన్సీబీ అధికారి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ముంబైలోని మరో రెండు ప్రాంతాల్లోనూ తమ బృందాలు సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాయని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వదిన పెళ్లి కోసం వుంచిన రూ.50 లక్షల విలువైన ఆభరణాలు దొంగలించిన మహిళ

Prakash Raj: మమ్ముట్టిలాంటి గొప్ప నటుడికి అలాంటి అవార్డులు అవసరం లేదు.. ప్రకాశ్ రాజ్

కరూర్ తొక్కిసలాట తర్వాత బుద్ధి వచ్చిందా.. తొండర్ అని పేరిట వాలంటీర్ల విభాగం

కొత్త అలెర్ట్: ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి

రాత్రి 11 గంటల ప్రాంతంలో కారులో కూర్చుని మాట్లాడుకోవడం అవసరమా? కోవై రేప్ నిందితుల అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments