Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీకేయ సీక్వెల్‌లో కలర్స్ స్వాతి గెస్టు రోల్‌

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (18:32 IST)
''కార్తికేయ'' సినిమాకు సీక్వెల్ రానుంది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కార్తికేయ. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సీక్వెల్‌లో కలర్స్ స్వాతి ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుందని సమాచారం. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తర్వాత హీరో నిఖిల్‌కి కూడా మంచి ఇమేజ్ దక్కింది.
 
'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాలో త్రిష చెల్లిగా.. అమాయకమైన పాత్రలో నటించి ఆకట్టుకుంది స్వాతి. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అందులో ఒకటి కార్తికేయ. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా కార్తికేయ 2 రాబోతోంది. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తుండగా.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో స్వాతి ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుందని సమాచారం.
 
ఇప్పటికే ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తుంది. రాక్షసుడు తర్వాత తెలుగులో ఆమె నటిస్తోన్న సినిమా ఇదే. కథ పరంగా మొదటి భాగంలో ఉండే హీరో పాత్ర మాత్రమే ఉంటుందని, మిగిలిన పాత్రలన్నీ మారిపోతాయని మరో టాక్‌ వినిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైల్వే ట్రాక్ సమీపంలో మృతదేహం.. చెవిలో హెర్బిసైడ్ పోసి హత్య.. ఎవరిలా చేశారు?

ఘర్షణపడిన తండ్రీకుమారులు.. ఆపేందుకు వెళ్లిన ఎస్ఎస్ఐ నరికివేత

Hyderabad: పేషెంట్‌ను పెళ్లి చేసుకున్న పాపం.. మానసిక వైద్యురాలు బలవన్మరణం

ఆగస్టు 15 నుండి ఉచిత ప్రయాణ సౌకర్యం- 25లక్షల మంది మహిళలకు ప్రయోజనం

నాలుగేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక వేధింపులు.. అతనెవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments