Webdunia - Bharat's app for daily news and videos

Install App

భానుమతి డైలాగులకు 'ఫిదా' అయిన సీఎం కేసీఆర్...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 'ఫిదా' అయిపోయారు. 'ఫిదా' చిత్రంలో భానుమతిగా నటించిన సాయిపల్లవి నటనకు ఆయన 'ఫిదా' అయిపోయారు. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ఆయన వీక్షించారు. ఆ తర్వాత చిత్ర యూనిట్‌ను ప్రశంస

Webdunia
సోమవారం, 24 జులై 2017 (16:19 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 'ఫిదా' అయిపోయారు. 'ఫిదా' చిత్రంలో భానుమతిగా నటించిన సాయిపల్లవి నటనకు ఆయన 'ఫిదా' అయిపోయారు. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ఆయన వీక్షించారు. ఆ తర్వాత చిత్ర యూనిట్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ముఖ్యంగా హీరోయిన్ సాయిపల్లవి నటనతో పాటు ఆమె మాట్లాడిన డైలాగులను ఎంతగానో మెచ్చుకున్నారు.
 
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఓ పార్టీ అధినేతగా ఉన్న కేసీఆర్ నిత్యం అధికారులతో సమీక్షలు, హరితహారం పనులు, ప్రజా సంక్షేమంపై దృష్టి ఇలా రోజంతా క్షణం తీరిక లేకుండా గడుపుతూ ఉంటారు. అయితే, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించి ఇటీవల విడుదలైన 'ఫిదా' సినిమా చూసి ఆయన ఫిదా అయిపోయారు. ఈ విషయాన్ని సినిమా పీఆర్వో వంశీ కాక, తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. కేసీఆర్ ఈ చిత్రాన్ని చూసిన తర్వాత అద్భుతంగా ఉందని ప్రశంసించినట్టు ఆయన తెలిపారు. చిత్ర టీమ్‌ను ఆయన అభినందించారు. 
 
ముఖ్యంగా భానుమతిగా నటించిన సాయి పల్లవి... స్వయానా ఓ తమిళ అమ్మాయి. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడంతో అచ్చ తెలంగాణ యాసలో డైలాగులు చెప్పేందుకు తెలుగు భాషను నేర్చుకుంది. ఆ తర్వాత చిత్రంలో డైలాగులేకాకుండా, అద్భుతమైన నటనతో ప్రతి ఒక్కరి మనసులను కొల్లగొట్టింది. భానుమతిలో సాయి పల్లవి చెప్పిన డైలాగులు సూబర్బ్‌గా ఉన్నాయంటూ మీడియాలో ప్రచారం కావడంతో ఈ చిత్రం నిర్మాతలను తన కార్యాలయానికి పిలిపించి.. ప్రత్యేక షోను వేయాల్సిందిగా సీఎం కోరారు. దీంతో సోమవారం ప్రత్యేక షోను వేయగా, కేసీఆర్ తిలకించి ఫిదా అయిపోయినట్టు ప్రకటించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చరిత్రలోనే తొలిసారి ఆప్ఘన్ మంత్రితో జైశంకర్ చర్చలు

హైదరాబాద్‌లో దారుణం : బ్యాట్‌తో కొట్టి.. కత్తులతో గొంతుకోసి హత్య

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' - టర్కీ కంపెనీలకు భారత్‌లో షాకులపై షాక్!!

హైదరాబాద్‌లో మెట్రో చార్జీల బాదుడే బాదుడు...

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments