Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌బ‌డ్డీ నేప‌థ్యంలో రూపొందిన సీటీమార్‌- విడుద‌ల‌కు సిద్ధం

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (16:15 IST)
Gopichand
గోపీచంద్, సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్‌ తెలిపారు.
 
నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో చేసిన స్పోర్ట్స్ డ్రామా  ఇది. గోపీచంద్‌ ఆంధ్ర టీమ్ క‌బ‌డ్డీ కోచ్‌గా, తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా త‌మ‌న్నా న‌టించారు. ఇద్ద‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి స‌రికొత్త పాత్ర‌ల్లో మెప్పిస్తార‌న‌డంలో సందేహం లేదు. వీరితో పాటు భూమిక, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్‌కి, రీసెంట్‌గా విడుద‌లైన జ్వాలా రెడ్డి సాంగ్‌, అప్స‌రా రాణి చేసిన స్పెష‌ల్ సాంగ్ స్పెష‌ల్ సాంగ్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. మా సినిమాకు మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌ మ్యూజిక్, సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అండ్ టీమ్ వ‌ర్క్‌ సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి. ద‌ర్శ‌కుడు సంపత్ నంది టేకింగ్‌ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ను ప‌ర్‌ఫెక్ట్స్‌గా మిక్స్ చేసి ప్ర‌తి సీన్ గ్రాండియ‌ర్‌గా, ఎగ్జయిట్‌మెంట్‌తో ప్రేక్ష‌కుల‌న అల‌రించేలా ఆయ‌న సినిమాను డైరెక్ట్ చేశారు. సెప్టెంబ‌ర్ 3న థియేట‌ర్స్‌లో వ‌స్తున్న మా సీటీమార్ చిత్రం హండ్రెడ్ ప‌ర్సెంట్ ఆడియెన్స్‌కు ఓ డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంద‌ని క‌చ్చితంగా చెబుతున్నాను’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ సీనియర్ నేత జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పిలుపు!!

సున్నపురాయి గనుల వేలం.. కాస్త టైమివ్వండి.. రేవంత్ విజ్ఞప్తి

తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ

అత్యవసరం ఉంటే తప్పా... ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. పౌరులకు భారత్ హెచ్చరిక!

లోక్‌సభ స్పీకరుగా ఓం బిర్లా ఎన్నిక.. ప్రొటెం స్పీకర్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments