Webdunia - Bharat's app for daily news and videos

Install App

Suriya: సినిమాకు కులం లేదు, సూర్య ఏ కులం? నెటిజన్లపై మంచు మనోజ్ ఫైర్

దేవీ
సోమవారం, 26 మే 2025 (11:34 IST)
Manchu Manoj, Mounika
సినిమా రంగంలో కులం ప్రాధాన్యత వుందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ అవుతుంది. మొన్ననే పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకొనేందుకు అగ్ర కులానికి చెందిన వారంతా హైదరాబాద్ ఛాంబర్ లో మీటింగ్ వేసి థియేటర్లు బంద్ గురించి సమావేశమయ్యారు. దానితో సోషల్ మీడియాలో ఆ అగ్రకులాలపై ప్రశ్నల దాడి జరిగింది. దానితో ఛాంబర్ దిగి వచ్చి సమ్మెను మేం ఖండిస్తున్నాం. ఇది పలానా హీరో సినిమా గురించి బంద్ పిలుపు ఇవ్వలేదని అత్యవసర సమావేశంలో వెల్లడించారు.
 
ఇక అసలు విషయానికి వస్తే, బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి చేసిన సినిమా భైరవం. ఇది తమిళ సినిమాకు రీమేక్. ఈ సినిమా ఈనెల 30న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా పలు ప్రమోషన్లు నిర్వహించారు. తాజాగా నిన్న రాత్రి హైదరాబాద్ లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా కులం గురించి మంచుమనోజ్ చేసిన వ్యాఖ్యాలు ఇండస్ట్రీని ఆలోచించేలా చేశాయి.
 
మనోజ్ మాట్లాడుతూ, ఒకే కులానికి చెందిన ముగ్గురు సినిమా చేశారని కామెంట్లు వస్తున్నాయి. అసలు కులం గురించి ఎందుకండీ ప్రస్తావన. ప్రేక్షకులు కులం చూసి థియేటర్ కు రారు. కొందరు లేనిపోని వివాదాలు క్రియేట్ చేస్తున్నారు. కొన్నిచోట్ల విని బాధేసింది. సినిమా అనేది ఓ కులానిదికాదు. సినిమా అనే కళామతల్లి కులం, గోత్రం చూడదు. మా గుడి సినిమా, మా దేవత కళామతల్లి. టికెట్ గెసేటప్పుడు ఇది కాపు, రెడ్డి, కమ్మ సినిమా అనేది చూడరు. 
 
సూర్య ఎవరండి? ఆయన సినిమానుచూసి మనం నెత్తిన పెట్టుకున్నాం. అలాగే సందీప్ రెడ్డి ఎవరండి? ఆయన జాట్ కు చెందినవారా, కపూర్ అని చూశారా. టాలెంట్ చూసి బాలీవుడ్, టాలివుడ్ అక్కున చేర్చుకుంది. టాలెంట్ ఉంటేనే దర్శక నిర్మాతలు నెత్తిమీద పెట్టుకుంటారు. సోషల్ మీడియాలో కులం గురించి రాతలు రాసిన వారిని అడుగుతున్నాను. నీ ఫ్రెండ్ ను 10వేలు అడగండి.. మీకు వారు ఇస్తారోలేదో.. చూద్దాం.  కానీ ఆర్టిస్టుపై నమ్మి డబ్బుపెట్టడం వరకే నిర్మాత చూస్తారు. కులం గురించి కాదు. మా చిత్ర నిర్మాత రాధా మోహన్ గారు కులం చూసి సినిమా తీయలేదు. మా ముగ్గురి కులం చూసి సినిమా తీయలేదు.
 
డబ్బు వస్తుందా? రాదా? అని చూడలేదు నిర్మాత. భైరం కూడా అదే. మా బేక్ గ్రౌండ్ చూసి సినిమా ఇవ్వలేదు. మాకు గొప్ప సక్సెస్ లేదు. గేప్ కూడా వచ్చింది. అయినా మాకు సినిమా ఇచ్చారు. అలాంటి నిర్మాతలు ఎల్లకాలం బతికుండాలి. సినిమా రంగాన్ని నిలబెట్టాలి అని అన్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాధామోహన్ నిర్మించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cake: 40వేల అడుగుల ఎత్తులో పుట్టినరోజు.. విమానంలో అమ్మ పుట్టినరోజు (video)

పీవోకేను గురుదక్షిణగా ఇస్తే సంతోషిస్తా : జగద్గురు రాంభద్రాచార్య

తల్లుల కన్నీటికి ప్రతీకారం తీర్చుకున్నాం.. పాక్‌ వైమానిక స్థావరాలు ధ్వంసం : ప్రధాని మోడీ

Viral Video అవార్డు ప్రదానం చేసి నటి మావ్రాను ఎర్రిమొహం వేసి చూసిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

Kavitha New Party: సొంత పార్టీని ప్రారంభించనున్న కల్వకుంట్ల కవిత.. పార్టీ పేరు అదేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments