స‌మంత‌, అల్లు అర్జున్ నుంచి ప్ర‌శ‌సంలు పొందిన కొరియోగ్రాఫర్ పొలాకి విజయ్

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (17:47 IST)
Polaki Vijay with Samantha, Allu Arjun
టాలెంట్ ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నెత్తిన పెట్టుకుంటుంది. మన స్టార్స్ నుంచి ఎంకరేజ్ మెంట్ కు కొదవేం ఉండదు. అలా ఈ మధ్య అల్లు అర్జున్, సమంత లాంటి స్టార్స్ తో ప్రశంసలు అందుకుంటున్నారు యంగ్ కొరియోగ్రాఫర్ పొలాకి విజయ్ . ప్యాన్  ఇండియా సెన్సేషన్ పుష్ప ఫంక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొరియోగ్రాఫర్  పొలాకి విజయ్ గురించి ప్రశంసిస్తూ మాట్లాడారు. అలాగే పుష్ప లో సమంత చేసిన ఊ అంటావా, ఉ ఉ అంటావా సాంగ్ కు కూడా పొలాకి విజయ్ యే డాన్స్ మాస్టర్. ఇతని వర్క్ సమంతా కు బాగా నచ్చింది.అందుకే బెస్ట్ విశెస్ చెబుతూ ఎంకరేజ్  చేసింది.
 
రీసెంట్ గా విజేత, కొబ్బరిమట్ట, తిప్పరా మీసం, పలాస 1978, అల్లుడు అదుర్స్, శశి లాంటి అనేక చిత్రాలకు బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ చేసిన పొలాకి విజయ్ ఇటీవల పుష్పతో పాటు గల్లా అశోక్ హీరో చిత్రానికీ నృత్యాలు అందించారు. హీరో సినిమాలో డోనల్ డగ్గు ర్యాప్ సాంగ్ కు విజయ్ కంపోజ్ చేసిన అదిరే స్టెప్పులకు మంచి పేరొస్తోంది. త్వరలో నరకాసురతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లకు పనిచేయబోతున్నారు పొలాకి విజయ్ . ఈ యంగ్ కొరియోగ్రాఫర్ స్పీడ్ చూస్తుంటే ఫ్యూచర్ లో స్టార్ కొరియోగ్రాఫర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments