Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు బ్యాక్ డ్రాప్‌లో జాతర చిత్రం నవంబర్ లో విడుదల

Jatara poster
డీవీ
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (17:16 IST)
Jatara poster
దర్శకత్వం, రచయిత, హీరోగా తమ తమ టాలెంట్‌లను చాటుకుంటున్న సతీష్ బాబు రాటకొండ ‘జాతర’ అనే చిత్రం ఇండస్ట్రీలోకి రాబోతోంది. గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సతీష్ బాబు రాటకొండ నటిస్తూ, దర్శకత్వం వహించిన జాతర చిత్రానికి సంబంధించి ఇది వరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. 
 
ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో రగ్డ్‌గా, ఇంటెన్స్ డ్రామాతో జాతర చిత్రం రాబోతోంది. చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్‌లో జరిగే జాతర నేపథ్యంలో ఈ సినిమా నవంబర్ 8న థియేటర్లోకి రాబోతోంది. 
 
ఈ చిత్రంలో దీయా రాజ్ కథానాయికగా నటించగా.. ఆర్.కె. పిన్నపాల, గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా, సాయి విక్రాంత్ సహాయక పాత్రల్లో నటించారు. కె.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, శ్రీజిత్ ఎడవణ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 8న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది.
 
తారాగణం: సతీష్ బాబు రాటకొండ,  దీయా రాజ్, ఆర్.కె. పిన్నపాల, గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా, సాయి విక్రాంత్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments