Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి 1న వస్తున్న 'చిత్రం భళారే విచిత్రం'

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2015 (16:47 IST)
చాందిని ప్రధాన పాత్రలో భాను ప్రకాష్‌ బలుసు దర్శకత్వం వహించిన కామెడీ థ్రిల్లర్‌ 'చిత్రం భళారే విచిత్రం. పి.ఉమాకాంత్‌ నిర్మించిన ఈ చిత్రంలో మనోజ్‌ నందం, అనీల్‌ కళ్యాణ్‌ ఇతర పాత్రధారులు. నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న విడుదల కానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు భాను ప్రకాష్‌ మాట్లాడుతూ ''సినిమా నేపథ్యంలో రూపొందిన కామెడీ థ్రిల్లరిది. కమర్షియల్‌ సినిమాకు కావలసిన అన్ని ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో ఉన్నాయి. రెగ్యులర్‌ ఫార్మెట్‌కి భిన్నంగా ఉండే చిత్రమిది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కుటుంబం మొత్తం చూసేలా ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌లకు స్పందన బావుంది. చాందిని నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం'' అని అన్నారు.
 
నిర్మాత ఉమాకాంత్‌ మాట్లాడుతూ ''ప్రయోగం సినిమా చూశాక భాను ప్రకాష్‌లో ఉన్న ప్రతిభ ఏంటో తెలిసింది. తర్వాత నాకు నచ్చిన కామెడీ థ్రిల్లర్‌ జోనర్‌లో ఈ కథ చెప్పారు. దాంతో నేను నిర్మాతగా మారి ఈ సినిమా చేశాను. రెగ్యూలర్‌ చిత్రాల్లాగా రివేంజ్‌ స్టోరీ కాదిది. కామెడీ, సస్పెన్స్‌, ఎమోషన్స్‌ అన్ని సమపాళ్ళలో ఉంటాయి. క్లైమాక్స్‌ ప్రతి ఒక్కరి చేత కంట తడిపెట్టిస్తుంది. నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. నూతన సంవత్సర కానుకగా మా సినిమాను జనవరి 1న ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం'' అని తెలిపారు. 
 
సౌమ్య, శుభశ్రీ, జీవా, సూర్య, ప్రభాస్‌ శ్రీను, అల్లరి సుభాషిని, వేణుగోపాలరావు, వాసు ఇంటూరి, రాము, కేక భాషా, శరత్‌బాబు పుదూరు, రుద్ర ప్రకాష్‌, రాకెట్‌ రాఘవ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: టి.సురేంద్రరెడ్డి, ఎడిటింగ్‌: గోపి సిందం, సంగీతం: కనకేష్‌ రాథోడ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రాము వీరవల్లి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments