Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి 153వ చిత్రం షూటింగ్ ప్రారంభం

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (17:32 IST)
Raja-chiru-Thaman
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహ‌న్‌ రాజా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న కొత్త చిత్రం షూటింగ్‌ ‘#చిరు 153’ అనే వర్కింగ్ టైటిల్‌తో శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, సూప‌ర్‌గుడ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌పై నిర్మిత‌మ‌వుతోన్న ఈ సినిమా షెడ్యూల్ భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌తో ప్రారంభ‌మైంది. మెగాస్టార్ చిరంజీవిపై ఈ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.
 
స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ మోహ‌న్‌రాజా ఈ చిత్రానికి గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేను స‌మ‌కూర్చారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ నిర‌వ్‌షా విజువ‌ల్స్ అందిస్తున్న ఈ చిత్రానికి ప‌లు బాలీవుడ్ చిత్రాల‌కు వ‌ర్క్ చేసిన‌ సురేశ్ సెల్వ‌రాజ‌న్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.
 
సెన్సేష‌న‌ల్ ఎస్.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, త‌మ‌న్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న తొలి చిత్రంకావ‌డంతో త‌మ‌న్ చాలా ఎగ్జ‌యిట్‌మెంట్‌తో స్వరాల‌ను స‌మ‌కూరుస్తున్నారు. ఇప్ప‌టికే త‌మ‌న్ ఓ సాంగ్ కంపోజిష‌న్‌ను కూడా పూర్తి చేయ‌డం విశేషం.
 
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న్ రాజా
సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: నిర‌వ్ షా
ఆర్ట్ డైరెక్ట‌ర్‌: సురేశ్ సెల్వ‌రాజ‌న్‌
నిర్మాణ సంస్థ‌లు:  కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, సూప‌ర్ గుడ్ ఫిలింస్‌
నిర్మాత‌లు: ఆర్‌.బి.చౌద‌రి, ఎన్‌.వి.ప్ర‌సాద్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: వాకాడ అప్పారావు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిరూపిస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం : చెవిరెడ్డికి బాలినేని సవాల్

బంగాళాఖాతంలో మరింతగా బలపడిన వాయుగుండం.. దిశ మారుతుందా?

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments