Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమానిని విమానంలో ర‌ప్పించి ఆర్థిక సాయం చేసిన చిరంజీవి

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (12:49 IST)
chiru- fan venkat
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఆరాధ్య దైవం, తన అభిమానుల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారాయన. అనారోగ్యంతో బాధపడుతున్న విశాఖపట్టణంకు చెందిన వెంకట్ అనే అభిమాని మెగాస్టార్ చిరంజీవి గారిని చూడాలని అనుకుంటున్నట్టు ట్విట్టర్ వేదికగా కోరగా వెంటనే ఫ్లైట్ టికెట్లు తీయించి మరీ మెగాస్టార్ హైదరాబాద్ పిలిపించుకున్న సంగతి తెలిసిందే. 
 
వెంకట్ సహా ఆయన భార్య సుజాతతో సుమారు నలభై ఐదు నిమిషాల పాటు భేటీ అయిన చిరంజీవి వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకోవడమే కాక మెడికల్ రికార్డులు కూడా పరిశీలించారు. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం కోసం హైదరాబద్ ఒమేగా హాస్పటల్ కి పంపి వైద్య పరీక్షలు చేయించడమే కాక విశాఖపట్నం అయితే వారి స్వస్థలం కాబట్టి అక్కడే చికిత్స తీసుకుంటే అన్ని విధాలా సౌకర్యంగా ఉంటుందని భావించి ఏర్పాట్లు కూడా చేశారు. 
 
అవసరం అయితే చెన్నై లాంటి మహానగరానికి తీసుకెళ్ళి తన అభిమానిని కాపాడుకుంటానని  శ్రీ చిరంజీవి అభయం ఇచ్చారు. ఇక వెంకట్ కు మెగాస్టార్ చిరంజీవి రెండు లక్షల ఆర్థిక సహాయం కూడా చేశారు. అవసరమైన వైద్య ఖర్చులు తాను భరిస్తానని చెప్పిన శ్రీ చిరంజీవి తక్షణ సహాయంగా రెండు లక్షల రూపాయలు సాయాన్ని అందించారు. తన అభిమాన హీరోని చూస్తే చాలని భావించిన వెంకట్ కు చిరంజీవి తన విషయంలో, తన ఆరోగ్యం విషయంలో చూపిస్తున్న శ్రద్ధ చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ అభిమానిగా పుట్టడం తన పూర్వ జన్మ సుకృతం అంటున్నారు వెంకట్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments