Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిటైర్మెంట్ తర్వాత విశాఖలో స్థిరపడతా : మెగాస్టార్ చిరంజీవి

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (22:38 IST)
తనకు ఎంతగానో నచ్చిన ప్రాంతం విశాఖపట్టణం అని, ఇక్కడ ఒక ఇల్లు ఉండాలన్నది తన చిరకాల కోరిక అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తాను నటించిన చిత్రం "వాల్తేరు వీరయ్య" చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి వైజాగ్ వేదికగా జరిగింది. 
 
ఇందులో మాట్లాడుతూ, విశాఖ నగరం నాకు ఎంతో ఇష్టం. ఇక్కడి వాతావరణం ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడి ప్రజల మనస్సు ఎంతో విశాలమైంది. సాయంత్రం వేళ ఆర్కే.బీచ్‌లో అలా ఫ్యామిలీ నడుచి వెళ్లేవారు ఉంటారు. విశాఖ వాసులు శాంతి కాముకులు. అందుకే ఇక్కడ శాంతి కాముకులు. ఇక్కడ ఒక కాస్మోపాలిటన్ వాతావరణం ఉందన్నారు. 
 
అందుకే ఇలాంటి ప్రదేశంలో ఒక ఇల్లు ఉండాలన్నది నా చిరకాల కోరికగా ఉండేది. ఇది ఎంతోకాలంగా ఉంది. కానీ అదీ సాధ్యపడలేదు. కానీ, ఇటీవలే ఓ ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశాను. భీమిలి వెళ్లే మార్గంలో ఆ స్థలం ఉంది. అయితే, ఇంకా ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించలేదు. తన రిటైర్మెంట్ తర్వాత ఇక్కడ హాయిగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాను అని చిరంజీవి తన మనస్సులో మాటను బహిర్గతం చేశారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments