Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి "సైరా"కు లీకుల బాధ... నెట్టింట్లో వైరల్

మెగాస్టార్ చిరంజీవికి లీకుల బాధ తప్పడం లేదు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Webdunia
ఆదివారం, 29 జులై 2018 (12:50 IST)
మెగాస్టార్ చిరంజీవికి లీకుల బాధ తప్పడం లేదు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ చిత్రానికి లీకుల బాధ తప్పడం లేదు. ఆల్రెడీ సినిమాకు సంబంధించి కొన్ని పిక్స్ ఇటీవలే లీక్ అయ్యాయి. కొన్ని పిక్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
 
సినిమా లీకుల బారిన పడకుండా చిత్రబృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయినా కూడా మళ్లీ సినిమాకు సంబంధించిన రెండు పిక్స్ లీకై నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. బ్రిటిష్ సోల్జర్స్ గెటప్‌లో యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఆర్టిస్టుల పిక్, ఓ భారీ కోట తగలబడుతున్న సీన్ లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా‌లోని పిక్స్‌ను చూస్తుంటే సినిమా రేంజ్ ఏంటో తెలుస్తోంది.
 
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో హీరో రామ్ చరణ్ తేజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఇందులో హీరోయిన్‌గా నయనతార నటిస్తుంటే, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి అగ్ర నటీనటులు ఈ చిత్రంలో పాలుపంచుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments