Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోషన్ కనకాల బబుల్‌గమ్ సెకండ్ సింగిల్ లాంచ్ చేయనున్న చిరంజీవి

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (18:00 IST)
Chiranjeevi
రోషన్ కనకాల తొలి చిత్రం ‘బబుల్‌గమ్‌’ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీచరణ్ పాకాల ‘బబుల్‌గమ్’ కోసం చార్ట్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు.
 
ఫస్ట్ సింగిల్ హబీబీ జిలేబీ పాట ట్రెమండస్ రెస్పాన్స్ తో వైరల్ అయ్యింది. ఇప్పుడు మేకర్స్ సెకండ్ సింగిల్ 'ఇజ్జత్' సాంగ్ అప్డేట్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి నవంబర్ 23న ఇజ్జత్ సాంగ్ ని లాంచ్ చేయనున్నారు. సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో  రోషన్ కనకాల స్టన్నింగ్ లుక్ తో ఆకట్టుకున్నారు.
 
క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలలో ఎక్స్ ట్రార్డినరీ వర్క్ తో ఆకట్టుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు మనసుని హత్తుకునే జెన్జీ ప్రేమకథతో ప్రేక్షకులను కట్టిపడేసేలా "బబుల్‌గమ్" రూపొందించారు. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సరికొత్త రొమాంటిక్ జర్నీతోప్రేక్షకులని ఆకట్టుకోనుంది.
 
ప్రతిభావంతులైన తారాగణం, అద్భుతమైన సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. గరుడవేగ, తెల్లవారితే గురువారం, ఆకాశవాణి చిత్రాలకు పనిచేసిన సురేష్ రగుతు ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.
 
పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది.
 
తారాగణం: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments