చిరంజీవి, ప్ర‌భాస్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్, మ‌హేష్‌ ను చూసే తీరు వేరేలా ఉంటుంది : రాధికా శరత్‌కుమార్

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (15:52 IST)
Radhika Sarathkumar
ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ‘ల‌వ్ టుడే’. ఇవాన హీరోయిన్‌గా న‌టించింది. త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ను న‌వ్వుల్లో ముంచెత్తి ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమాను నవంబర్ 25న  విడుద‌ల చేయ‌టానికి నిర్మాత దిల్‌రాజు సిద్ధ‌మ‌వుతున్నారు. శుక్ర‌వారం ఈ మూవీ ట్రైల‌ర్‌, ఆడియో లాంచ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. వంశీ పైడ‌ప‌ల్లి, అనీల్ రావిపూడి, రాధికా శ‌ర‌త్ కుమార్ బిగ్ సీడీని రిలీజ్ చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా రాధికా శరత్‌కుమార్ మాట్లాడుతూ, ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ తొలిసారి క‌థ చెప్ప‌గానే సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని నేను చెప్పాను. తెలుగు సినిమా మార్క‌ట్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. సినిమా గురించి ఇక్క‌డ ఉండే అవుట్ లుక్ గొప్ప‌గా ఉంటుంద‌ని నేను గ‌ర్వంగా చెప్ప‌గ‌ల‌ను. తెలుగు ఆడియెన్స్ హీరోలైన చిరంజీవి, ప్ర‌భాస్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్, మ‌హేష్‌ వంటి వారిని చూసే తీరు వేరేలా ఉంటుంది. దిల్ ఉండే నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను తీసుకున్నార‌ని తెలియ‌గానే, ఆయ‌నెలా చేస్తారోన‌ని ఆస‌క్తిగా వెయిట్ చేశాను.
 
 ఇక్క‌డ మ‌హేష్‌, ప్ర‌భాస్, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌ను ఎలాగైతే తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారో, ల‌వ్ టుడే సినిమా త‌ర్వాత ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ కూడా అలాగే ఆద‌రిస్తారు. ఈ మూవీలో కంటెంట్ కింగ్. నేను చాలా సంవ‌త్స‌రాలుగా చాలా మంది న‌టీన‌టుల‌తో క‌లిసి సినిమా చూశాను. చాలా ఏళ్ల త‌ర్వాత థియేట‌ర్‌లో ఆడియెన్స్ సినిమాను సెల‌బ్రేట్ చేయ‌టాన్ని నేను గ‌మ‌నించాను. ప్ర‌తీ ఒక్క‌రూ స‌బ్జెక్ట్‌కు క‌నెక్ట్ అవుతున్నారు. సినిమాలో ఫోన్స్ ఎక్సేంజ్ చేసిన‌ట్లు చూపించారు. కానీ అస‌లు విష‌యం క్యారెక్ట‌ర్స్ ఎక్సేంజ్ అనే చెప్పాలి. యువన్ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. మీలో చాలా మంది మిమ్మల్ని మీరు తెరపై చూసుకుంటారు’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?

దుబాయ్ ఎయిర్‌షోలో ప్రమాదం... కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments