Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇంట‌ర్ పాస్అయి డిగ్రీకి వెళ్తున్న ఫీలింగ్' : తొలిప్రేమ యూనిట్

మెగా హీరో వరుణ్ తేజ్, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం "తొలిప్రేమ". ఈ చిత్రానికి వెంకీ అట్లూరి ద‌ర్శక‌త్వం వహించగా, బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. తన బాబాయ్ పవన్ కల్యాణ్ నటించిన 'తొలిప్రేమ' టైటిల్‌న

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (15:16 IST)
మెగా హీరో వరుణ్ తేజ్, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం "తొలిప్రేమ". ఈ చిత్రానికి వెంకీ అట్లూరి ద‌ర్శక‌త్వం వహించగా, బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. తన బాబాయ్ పవన్ కల్యాణ్ నటించిన 'తొలిప్రేమ' టైటిల్‌ను ఇపుడు వరుణ్ తేజే వాడేసుకున్నాడు. అయితే, ఈ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. 
 
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్‌ సభ్యులను అభినందించేందుకు శుక్రవారం తన ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. దీంతో హీరో వరుణ్ తేజ్‌తో పాటు ద‌ర్శకుడు వెంకీ, నిర్మాత వి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, బాపినీడు, యూనిట్‌ ఇతర సభ్యులు చిరంజీవి ఇంటికి వెళ్లగా, వారిని చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. 
 
ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ, 'నాకు యాక్టర్ అవ్వాల‌న్న ఆలోచ‌న చిరంజీవిగారిని చూసే వ‌చ్చింది. ఈ రోజు డాడి వ‌చ్చి మంచి మాట‌లు చెబుతుంటే చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది' అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఆ తర్వాత చిత్ర సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ, నిజానికి నేను సంగీత దర్శకుడు కాకముందు నుంచే 'నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయ‌న మ‌మ్మల్ని గుర్తించి పిలిపించి.... ప్రశంసించ‌డం మాకు చాలా ఆనందాన్నిస్తోంది. మరోలా చెప్పాలంటే ఇంట‌ర్ పాస్అయి డిగ్రీకి వెళ్లున్న ఫీలింగ్ కలుగుతుంది' అని అన్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments